YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఇండియన్ స్టాక్ మార్కెట్‌ ఈ వారంలో వరుసగా రెండో రోజు కూడా లాభాల్లోనే ముగిసింది. రోజంతా ఒడిదుడుకులకు గురైన బెంచ్‌మార్క్ సూచీలు చివరిలో కొనుగోళ్ల కారణంగా స్వల్ప లాభాలతోనే ముగిశాయి. మంగళవారం సెన్సెక్స్ 66 పాయింట్ల లాభంతో 39,750 పాయింట్లకు ఎగసింది. ఇక నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో 11,929 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 50లో జీ
ఎంటర్‌టైన్‌మెంట్, యస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, రిలయన్స్, విప్రో, ఐఓసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. యస్ బ్యాంక్ 4 శాతానికి పైగా పెరిగింది. అదేసమయంలో భారతీ ఇన్‌ఫ్రాటెల్, బజాజ్ ఆటో, హీరో మోటొకార్ప్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్అండ్‌టీ, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. బజాజ్ ఆటో 3 శాతానికి పైగా పడిపోయింది. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియల్టీ మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే క్లోజయ్యాయి. ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు ఎక్కువగా పడిపోయాయి

Related Posts