YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీజేపీతో రాజీ లేదు ఓట్లె పెరిగిన సీట్లు తగ్గాయ్

బీజేపీతో రాజీ లేదు ఓట్లె పెరిగిన సీట్లు తగ్గాయ్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

సార్వత్రిక ఎన్నికల్లో విచిత్రమైన ట్రెండ్ కనిపించిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపోటములపై రకరకాల కారణాలు ఉన్నాయన్నారు. 2014లో 34 శాతం ఓట్లతో టీఆర్‌ఎస్ 11 సీట్లు ఎంపీ సీట్లు గెలిచింది. 2014 కంటే ఇప్పుడు 6 శాతం ఓట్లు పెరిగినా 9 సీట్లే గెలిచాం. పార్టీలో అందరూ బాగా కష్టపడ్డారు. ఐనా ఫలితం ఇలా వచ్చింది. కాంగ్రెస్ గెలిచిన 3 సీట్లలో 2 సీట్లు స్వల్ప తేడాతో గెలిచింది. ఎంపీ ఫలితాలు టీఆర్‌ఎస్‌కు ఎదురు దెబ్బ కాదన్నారు. మోది ప్రధానమంత్రి అభ్యర్థిత్వమే బీజేపీకు ఓటింగ్ పెంచింది. బీజేపీ కార్యకర్తలు లేని చోట్ల కూడా ఆ పార్టీకి ఓట్లు పడ్డాయి. ఆదిలాబాద్ ఎంపీ సీటు గెలుస్తామని బీజేపీ కూడా ఊహంచి ఉండదన్నారు. డిసెంబర్‌లో సిరిసిల్లలో బీజేపీకి 3 వేల ఓట్లు పడితే ఇప్పుడు 50 వేలు పడ్డాయి. రాహుల్ గాంధీ, దేవెగౌడ వంటివాళ్లే ఓడిపోయారు. తాము కూడా ఇలాంటి ఫలితాలు ఊహించలేదన్నారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక సరిగా లేదన్న వ్యాఖ్యలు వాస్తవం కాదన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 4 లక్షల ఓట్లు తగ్గాయి. ఈ మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎవరి మద్దతు అవసరం లేదన్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాను విఫలం అయ్యానని అనుకోవడం లేదన్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే ఫలితాలపై పూర్తిస్థాయిలో సమీక్షిస్తామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని.. సింహభాగం సీట్లు గెలుస్తామన్నారు. కేంద్రంతో అంశాల వారీగా సత్సంబంధాలు కొనసాగుతాయన్నారు. రాష్ట్ర సమస్యల విషయంలో బీజేపీతో రాజీ పడేది లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు వల్లే కవిత ఓడిపోయారు..నిజామాబాద్‌లో కవిత ఓటమికి రైతులు కారణం కాదన్నారు. నిజామాబాద్‌లో నామినేషన్లు వేసింది రైతులు కాదు. రాజకీయ కార్యకర్తలేనన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో ఓ కాంగ్రెస్ నేత ఇంటి నుంచి 93 మంది నామినేషన్లు దాఖలయ్యయన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు వల్లే కవిత ఓడిపోయారు. తాను, కవిత అనేక డక్కామొక్కీలు తిన్నట్లు తెలిపారు. ఒక్క ఓటమితో కుంగిపోమన్నారు. హరీశ్‌రావును ఈ ఎన్నికల్లో పక్కన పెట్టామనేది నిజం కాదన్నారు. మెదక్‌లో మంచి ఆధిక్యం వచ్చినా.. సిద్దిపేటలో కూడా మెజారిటీ తగ్గిందన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య సత్సంబంధాలు ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అసెంబ్లీ ఎంపీ ఎన్నికలు ఒకేసారి జరిగి ఉంటే టీఆర్‌ఎస్‌కు నష్టం అనేదానితో ఏకీభవించనన్నారు. ఒడిశాలో రెండు ఎన్నికలు కలిపి వచ్చినా నవీన్ అక్కడ గెలిచారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంకా సాంకేతికంగా టీఆర్‌ఎస్‌లో చేరలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో టీఆర్‌ఎస్‌కు నష్టం జరిగిందనే వాదన సరికాదన్నారు. మోదీతో మా సంబంధాలు రాజ్యాంగ పరమైనవిగానే ఉంటాయన్నారు. హాజీపూర్ ఘటనపై కొందరు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు. అలాంటి రాజకీయ తాము చేయమన్నారు. బాధితులకు న్యాయం చేస్తామన్నారు.

Related Posts