YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆమంచికి చెక్ చెప్పేశారు...

ఆమంచికి చెక్ చెప్పేశారు...

ఏపీలో ఈ సారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోనే అత్యంత ఆస‌క్తిరేపిన నియోజ‌క‌వ‌ర్గం చీరాల‌. ప్ర‌కాశం జిల్లాలోని ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త రెండుసార్లు వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తోన్న ఆమంచి
కృష్ణ‌మోహ‌న్ ఈ సారి వైసీపీ నుంచి పోటీ చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆమంచి ఆ త‌ర్వాత టీడీపీ నుంచి వచ్చిన ఒత్తిళ్ల‌తో త‌న‌ను తాను కాపాడుకునేందుకు టీడీపీలో చేరారు. ఐదేళ్ల పాటు ప్ర‌భుత్వంలో ఉన్న ఆమంచి ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీని వీడ‌డంతో పాటు చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.
అక్క‌డితో ఆగ‌కుండా ఈ ఎన్నిక‌ల్లో తాను మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్ట‌డంతో పాటు తాను ఈ సారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెడితే చంద్ర‌బాబు త‌న‌ను చూసి ఏ గుమ్మం నుంచి పారిపోతాడ‌ని కూడా వ్యంగ్యాస్త్రాలు వేశారు. చివ‌ర‌కు చంద్ర‌బాబు అసెంబ్లీలో ఉంటే చీరాల‌లో మాత్రం అనూహ్యంగా ఆమంచి ఓడిపోయారు. ఎన్నిక‌ల‌కు ముందు ఇక్క‌డ క‌ర‌ణం బ‌ల‌రాం కాదు… చంద్ర‌బాబు వచ్చి పోటీ చేసినా గెలుస్తాన‌ని స‌వాళ్లు రువ్విన ఆమంచి మూడో ప్ర‌య‌త్నంలో ఓడారు.చీరాలలో టీడీపీ అభ్యర్థి కరణం బలరాం గెలిచారు. వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై 17,801 మెజారిటీతో విజయం సాధించారు. తిమ్మసముద్రానికి చెందిన కరణం బలరాం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆయ‌న గ‌తంలో మార్టూరు, అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నిక‌ల్లో అద్దంకిలో గొట్టిపాటి ర‌వికుమార్ వ‌ర్సెస్ క‌ర‌ణం బ‌ల‌రాం మ‌ధ్య టీడీపీ సీటు కోసం పెద్ద యుద్ద‌మే న‌డిచింది.ఆమంచి పార్టీ మార‌డంతో చంద్ర‌బాబు బ‌ల‌రాంను చీరాల‌కు పంపారు. అక్క‌డ బ‌ల‌రాం ఆమంచిని మ‌ట్టి క‌రిపించారు. ఇటు అద్దంకిలో ర‌వికుమార్ కూడా గెలిచారు. అటు ర‌వి నాలుగోసారి, ఇటు బ‌ల‌రాం ఐదోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నాన్ లోకల్ కావడంతో కరణం బలరాం ఓడిపోతారని అనుకున్నారు. ప్రజల అనూహ్య తీర్పుతో ఆమంచి కృష్ణమోహన్‌కు షాక్ తగిలింది. ఇక్క‌డ ఆమంచి స్వ‌యంకృతాప‌రాధ‌మే ఆయ‌న ఓట‌మికి కార‌ణ‌మైంది

Related Posts