యువ్ న్యూస్ జనరల్ బ్యూరో
కొందరు సీనియర్ ఐఏఎస్‌లు ఆంధ్రాకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ అప్రధానమైన పోస్టుల్లో కొనసాగేకన్నా ఏపీకి వెళ్లాలనే యోచనలో ఉన్నారు. ఇందుకు కారణం జూనియర్ల ముందు సీనియర్లు
చేతులు కట్టుకుని నిలబడలేకనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.. పని చేస్తున్న చోట అవమానాలు పడేకన్నా పొరుగు రాష్ట్రానికి వెళ్లడమే మంచిదన్న ఉద్దేశంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు
ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌లలో 40 మంది అధికారులను కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ తెలంగాణ క్యాడర్‌కు కేటాయించింది. ఇప్పుడు
అందులోనుంచే కొందరు తిరిగి ఏపీ క్యాడర్‌కు మారాలనుకుంటున్నారు. తెలంగాణలో గత ఐదేండ్లుగా ఎన్నో అవమానాలు పడ్డామని, తమను టీఆర్‌ఎస్ సర్కారు చులకనగా చూస్తుండటం వల్లనే
తాము పొరుగు రాష్ట్రానికి వెళ్లే ఆలోచనలో ఉన్నామని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వివక్షకు గురవుతున్న కొందరు ఐఏఎస్‌లు ఏపీ క్యాడర్‌కు వెళ్లాలనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తమను అప్రధానమైన పోస్టింగ్‌లకపరిమితం చేస్తున్నారని గత కొన్ని నెలలుగా కొందరు ఐఏఎస్‌లు ఆందోళన వ్యక్త చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త జిల్లాల్లో తమను కాదని నాన్ క్యాడర్ ఐఏఎస్‌లను నియమించడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు. కన్ఫర్డ్ ఐఏస్‌లకు కీలకమైన శాఖలను ఇచ్చి నేరుగా నియమితులైన ఐఏఎస్‌లను
మాత్రం మామూలు పోస్టింగ్‌లకు బదిలీ చేశారన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతున్నది. ఈ విషయంపై కొందరు సీనియర్ ఐఏఎస్‌లు ప్రభుత్వంపై బాహాటంగా విమర్శలు కూడా చేశారు. తెలంగాణ
క్యాడర్ నుంచి తమను మార్చాలంటూ కొందరు కేంద్ర హౌంమంత్రిత్వ శాఖకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. కొంతమంది ఏపీకి వెళ్లాలనుకున్నా ఆ సమయంలో అక్కడ సీఎంగా చంద్రబాబు
ఉండటంతో వారు వెనకడుగు వేశారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో అసంతృప్తిగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్‌లు ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు వెళ్ళేందుకు
సిద్ధమవుతున్నారు.రాష్ట్రానికి చెందిన కొందరు ఐఏఎస్‌లు ఇప్పటికే ఏపీలోని సీనియర్ ఐఏఎస్ అధికారులతో భేటీ అయినట్టు సమాచారం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే కేంద్రం నుంచి ఎలాగైనా
తాము ఏపీకి బదిలీ చేయించుకుంటామని, ఇందుకు వారి సహకారాన్ని కోరినట్టు తెలిసింది.