YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ కేబినెట్ పై చర్చోపచర్చలు

 జగన్ కేబినెట్ పై చర్చోపచర్చలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మెహన్ రెడ్డి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంత్రివర్గ కూర్పుపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నెల 30న 
ముఖ్యమంత్రిగా జగన్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారా ? లేదా ఆయనతో పాటు కొంతమంది మంత్రులు కూడా అప్పుడే ప్రమాణస్వీకారం చేస్తారా ? అన్నది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్. జగన్ పార్టీ 
నుంచి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో చాలా మంది సీనియర్లు, జూనియర్లు, జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెనకే నడుస్తున్నవారు ఉన్నారు. కొంతమంది నాటి కాంగ్రెస్ 
ప్రభుత్వంలో తమ మంత్రి పదవులకు, ఎమ్మెల్యే పదవులకు రిజైన్ చేసి ఉప ఎన్నికలకు వెళ్లి మరి విజయం సాధించారు. వివిధ జిల్లాల నుంచి గెలిచిన వారిలో చాలా మంది సీనియర్లు ఉండడంతో 
పాటు గతంలో మంత్రులుగా పనిచేసిన వారు కూడా ఉన్నారు. దీంతో జగన్ ఎవరెవరికి కేబినెట్ బెర్త్‌లు ఇస్తారన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్ గా ఉంది.జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి 
ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, విశ్వస‌న‌రాయ కళావతి రేసులో ఉన్నారు. విజయనగరంలో బొత్స సత్యనారాయణ, రాజన్న దొర, పుష్ప శ్రీ వాణి, కోలగట్ల వీరభద్రస్వామి మంత్రి పదవులు 
ఆశిస్తున్నారు. విశాఖ నుంచి గొల్ల బాబురావు, గుడివాడ అమర్నాథ్‌, బూడి ముత్యాలనాయుడు, అవంతి శ్రీనివాస్ ఆశిస్తున్నారు. తూర్పుగోదావరిలో బీసీ కోటాలో పిల్లి సుభాష్ చంద్రబోస్, దాడిశెట్టి 
రాజా, కుర‌సాల‌ కన్నబాబు ప్రముఖంగా రేసులో ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఎస్సీ కోటాలో తెల్లం బాలరాజు, కాపు కోటాలో ఆళ్లనాని లేదా గ్రంధి శ్రీనివాస్‌లలో ఒకరికి మంత్రి పదవి 
దక్కవచ్చు. అదే జిల్లాలోని తానేటి వనిత ఎస్సీ మహిళా కోటాలో కేబినెట్ రేసులో ఉన్నారు.ఇక కృష్ణాజిల్లాలో కొడాలి నాని, సామినేని ఉదయభాను, పేర్ని నాని పేరు కూడా వినిపిస్తోంది. ఇక వెల‌మ‌ 
సామాజికవర్గం నుంచి నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు రేసులో ఉన్నారు. గుంటూరులో ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవులు ఖాయమయ్యాయి. 
అలాగే ఎస్సీ మ‌హిళా కోటాలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచ‌రిత పేరు కూడా వినిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇప్పటికే మంత్రి పదవి ఖాయం అవ్వగా… యర్రగొండపాలెం ఎమ్మెల్యే 
ఆదిమూలపు సురేష్ పేరు కూడా వినిపిస్తోంది. నెల్లూరు నుంచి ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి రేసులో ఉన్నారు. కడప నుంచి మైనార్టీ కోటాలో అంజాద్ భాషా, 
శ్రీకాంత్ రెడ్డి పదవులు ఆశిస్తున్నారు.చిత్తూరు నుంచి ఆర్‌కే. రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలలో ఇద్దరికి పదవులు రానున్నాయి. కర్నూలు జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ 
రెడ్డి, శ్రీదేవితో పాటు మైనార్టీ కోటాలో మ‌హ్మ‌ద్‌ హ‌ఫీజ్‌ ఖాన్ పేరు వినిపిస్తోంది. అనంతపురం జిల్లా నుంచి అనంత వెంకట్రామిరెడ్డి, శంకర్ నారాయణల‌లో ఒకరికి మంత్రి పదవి దక్కవచ్చు. అలాగే 
కాపు రామచంద్రారెడ్డి సైతం రేసులో ఉన్నారు. ఏదేమైనా కేబినెట్ లో జగన్ కాక మరో 25 మందికే ఛాన్స్ ఉంటుంది కానీ ప్రతి జిల్లా నుంచి ముగ్గురు నుంచి నలుగురు వరకు కేబినెట్ రేసులో 
ఉన్నారు. మరి వీరిలో ఫైనల్ గా జగన్ ఎవరికి మంత్రి ప‌ద‌వులు కల్పిస్తారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

 

 

Related Posts