YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేజ్రీవాల్ లో కలవరం

కేజ్రీవాల్ లో కలవరం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
 

2020 అరవింద్ కేజ్రీవాల్ కు ఇబ్బంది కరమైన సంవత్సరమనే చెప్పాలి. 2019 సార్వత్రిక ఎన్నికలు ఆయనకు ఘోర పరాభావాన్ని మిగిల్చాయి. వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 
అరవింద్ కేజ్రీవాల్ కు, కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా మారనున్నాయి. ఇప్పటి వరకూ ఢిల్లీపై తిరుగులేని ఆధికత్యను కొనసాగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు మున్ముందు గండం 
పొంచి ఉందన్నది వాస్తవం. సామాన్యుల పార్టీగా ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ తన ఓటు బ్యాంకును క్రమంగా కోల్పోతుందన్నది లోక్ సభ ఎన్నికల ఫలితాల ద్వారా రుజువవుతుంది.లోక్ సభ 
ఎన్నికల్లో ఢిల్లీ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ ఒక్కటీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకోలేకపోయింది. పైగా లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మూడో స్థానానికి పడిపోవటంతో కేజ్రీవాల్  లో కలవరం ప్రారంభమయింది. ప్రధానంగా ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ కు మద్దతు తెలపడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తిరిగి ఆ ఓటు బ్యాంకును పొందాలంటే ఒకింత కష్టమే అయనప్పటికీ 
వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కేజ్రీవాల్ దృష్టి పెట్టారు.వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలో క్లీన్ స్వీప్ చేసిన భారతీయ జనతా పార్టీ మంచి 
జోరుమీద ఉంది. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కలసి పోటీ చేయాలని తొలుత భావించినా వివిధ కారణాల వల్ల పొత్తు కుదరలేదు. చివరి నిమిషం వరకూ అరవింద్ కేజ్రీవాల్ పొత్తు కోసం 
ప్రయత్నించారు. అయితే మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ దీనికి అడ్డుపడ్డారు. పొత్తులతో ముందుకు వెళితే ఎప్పటికీ కాంగ్రెస్ ఢిల్లీలో ఎదగలేదని రాహుల్ కు నచ్చ చెప్పడంతో ఒంటరిగానే బరిలోకి 
దిగారు. దీంతో త్రిముఖ పోటీ జరిగి బీజేపీ భారీగా లబ్ది పొందింది.ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితుల్లో మార్పు వస్తుందన్న అంచనాలో కేజ్రీవాల్ ఉన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో కాంగ్రెస్ ప్రభుత్వాలున్నప్పటికీ మూడు నెలల్లోనే అక్కడి ప్రజల్లో మార్పు రావడాన్ని ఆయన ఉదహరిస్తున్నారు. అయితే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని వెళితే బాగుంటుందని పార్టీలో ఎక్కువ 
మంది నేతలు సూచిస్తున్నారు. గత ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో 67 స్థానాలను గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఈ ఫిగర్ సాధ్యం కాదు. కాంగ్రెస్ తో పొత్తు 
పెట్టుకుని బరిలోకి దిగితే సొంత పార్టీ నుంచే టిక్కెట్ల విషయంలో తేడా వస్తుందన్న ఆందోళన ఆయనలో కలుగుతోంది. మొత్తం మీద వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటి నుంచే కేజ్రీవాల్ ను 
కలవరపెడుతున్నాయి.

Related Posts