YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాబు మళ్లీ బిజీ బిజీ...

బాబు మళ్లీ బిజీ బిజీ...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
 

తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఓటమి నుంచి తేరుకున్నట్లు కన్పిస్తున్నారు. ఆయన ఖచ్చితంగా గెలుస్తామని వేసుకున్న లెక్కలు తప్పయ్యాయి. దారుణ ఓటమిని ఆయన 
జీర్ణించుకోలేకపోతున్నారు. అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఎందుకూ కొరగాకుండా పోయాయి. పోలవరం, అమరావతిలు కూడా రక్షించలేకపోయాయి. ప్రజలు గంపగుత్తగా వైఎస్ జగన్ 
మోహన్ రెడ్డి ఉండటాన్ని ఆయన ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. ఇంతటి దారుణమైన ఓటమిని చూస్తానని చంద్రబాబు కలలో కూడా అనుకోని ఉండరు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 
ఇంతటి హీనమైన ఫలితాలు సాధిస్తామని ఆయన ఊహకు కూడా అంది ఉండదు.మే 23వ తేదీ ఫలితాలు వచ్చిన నాటినుంచి చంద్రబాబునాయుడు ఉండవల్లి లోని తన నివాసంలోనే 
గడుపుతున్నారు. పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. సంక్షోభం సమయంలోనే చంద్రబాబు తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తారు. నలబై ఏళ్ల రాజకీయ జీవితం ఆయన ఎన్నో ఆటుపోట్లను 
చూపింది. ఈసారి మాత్రం చంద్రబాబు రిజల్ట్ వచ్చిన తర్వాత మూడు రోజులు తేరుకోలేకపోయారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడం, నిధుల లేమి వెంటాడుతున్నప్పటికీ ఆయన సంక్షేమ 
కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. తన శ్రమను ప్రజలు గుర్తిస్తారని చంద్రబాబు గుడ్డిగా నమ్మారు.
కొద్దిరోజులుగా సీనియర్ నేతలతో సమావేశమవుతున్న చంద్రబాబు దారుణ ఓటమికి గల కారణాలను విశ్లేషించలేకపోతున్నారని పార్టీ నేతలే చెబుతున్నారు. ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇవ్వడానికి 
ప్రభుత్వ వైఫల్యమ్యా? జగన్ వేవ్ అన్నది అర్థం కావడం లేదని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. సభలకు భారీ ఎత్తున ప్రజలు వచ్చినా అవి ఓట్ల రూపంలో రాలేదని మదన పడుతున్నారు. జగన్ 
వస్తే అభివృద్ధి ఆగిపోతుందని చెప్పిన తన మాటలను ప్రజలు విశ్వసించకపోవడానికి కారణాలను చంద్రబాబు అన్వేషిస్తున్నారు.చంద్రబాబునాయుడు మంగళవారం ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో 
పాల్గొన్నారు. బుధవారం టీడీఎల్పీ సమావేశం లో ఓటమి కారణాలను అన్వేషించే ప్రయత్నం ప్రారంభించారు. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల పాటు సహకరించాల్సి ఉంటుందని, ఎటువంటి విమర్శలు 
చేయవద్దని నేతలకు సూచించారు. దారుణ ఓటమి పాలయిన చంద్రబాబు హైదరాబాద్ వెళ్తారని అందరూ భావించారు. కానీ ఆయన అమరావతిని వదలలేదు. ఉండవల్లిలోనే ఉండి నేతలకు ధైర్యాన్ని 
నూరిపోస్తున్నారు. 2024 ఎన్నికలతో పాటు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలని, ఈ ఎన్నికల్లో టీడీపీకి 39 శాతం మంది ఓట్లు వేశారని, వారి పక్షాన నిలబడాల్సి ఉంటుందని 
చెబుతుందన్నారు. మొత్తం మీదచంద్రబాబునాయుడు ఓటమి నుంచి బయటపడి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో టీడీపీ నేతల్లో కొంత ఉత్సాహం కన్పిస్తుంది

Related Posts