యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కేంద్రంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. జాతీయ స్థాయిలో వామపక్షాలు ఆశించినట్లుగా ఈ ఎన్నికలు జరుగలేదు. నరేంద్రమోదీ 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలలో
ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు అన్ని పక్కకు
పోయినాయి. వామపక్షాలు తమ ఓటు బాంక్ బాగా తగ్గింది. మా బలాన్ని కోల్పోయం. భారత దేశంలో ఇప్పటివరకు ఇంత తక్కువ స్థాయిలో ఓట్లు వామపక్ష పార్టీలకు పోలైనాయి. కమ్యూనిస్టు
ఉద్యమాలు ఇంకా ఎక్కువగా జరగాలి. సురవరం సుధాకర గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కమ్యూనిస్ట్ ఉద్యమం పునరేకీకరణ కొరకు విజయవాడలో మొదటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అధికార
పార్టీ పై వ్యతిరేకత వైసీపీ పార్టీకి పోల్ అవడం అసాధారణ స్థాయిలో విజయాన్ని సాధించిందని అన్నారు.