యువ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర నటించిన తాజా సినిమా 'ఐ లవ్ యు'. ‘నన్నే... ప్రేమించు’ అనేది క్యాప్షన్. రచితా రామ్ హీరోయిన్. తెలుగు పరిశ్రమకు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’తో దర్శకుడిగా
పరిచయం అయిన ఆర్. చంద్రు, శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్ప్రైజెస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సినిమా ప్రీ రిలీజ్ ట్రైలర్ సోమవారం బెంగళూరులో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి 'ఈగ'
ఫేమ్ సుదీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్ణాటక విద్యాశాఖ మంత్రి జిటి దేవెగౌడ, మాజీ మంత్రి హెచ్.ఎం. రేవణ్ణ, వైఎస్సార్సీపీకి చెందిన ఏపీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి (కావలి నియోజకవర్గం),
'స్పెషలిస్ట్ హాస్పిటల్స్' రామచంద్రే గౌడ, 'మోహన్ మూవీస్' మోహన్ కుమార్, బహర్ ఫిలిమ్స్ బాషా, లక్ష్మి ప్రసాద్ అతిథులుగా హాజరయ్యారు. 'ఐ లవ్ యు' ప్రీ రిలీజ్ ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి
అద్భుత స్పందన లభిస్తోంది. ఫస్ట్ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది. జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లలో సినిమాను విడుదల
చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు ఆర్. చంద్రు మాట్లాడుతూ "ఉపేంద్రగారు అభిమానుల చక్రవర్తి. చందనసీమ (కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ) కీర్తి ప్రతిష్టలను ఇతర చిత్రసీమలకు తీసుకువెళ్లిన సూపర్స్టార్. అభినయ చక్రవర్తి సుదీప్ గారు కూడా ఈ రోజు ఇక్కడ ఉండటం నాకు సంతోషంగా ఉంది. ఆయన సింప్లిసిటీ నాకెంతో ఇష్టం. ఆయన ఎప్పుడూ డౌన్ టు ఎర్త్ ఉంటారు. 'ఐ లవ్ యు' విషయానికి వస్తే... ఇది మరొక 'గీతాంజలి'. ఉపేంద్రగారు ఆయన పాత్రలో అద్భుతంగా నటించారు. హీరోయిన్ రచితా రామ్ తొలిసారి ఎరోటిక్ ఎపిసోడ్లో నటించింది. బోల్డ్ సన్నివేశాల్లో నటించాలని, నటిస్తేనే కథకు న్యాయం జరుగుతుందని స్క్రిప్ట్ విన్నప్పుడే ఆమెకు తెలుసు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు విచ్చేసిన జిటి దేవెగౌడ గారికి, మిగతా అతిథులకు థాంక్స్. దేవెగౌడగారు నన్ను సొంత బిడ్డలా చూసుకుంటారు. జూన్ 14న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో విశాఖపట్టణం సముద్రతీరంలో తెలుగు వెర్షన్ పాటలను విడుదల చేస్తాం. ఘనంగా ఆడియో వేడుక నిర్వహించబోతున్నాం"
అన్నారు. 'ఐ లవ్ యు' ప్రీ రిలీజ్ ట్రైలర్, సినిమాలో ఉపేంద్ర ఇంట్రడక్షన్ సాంగ్ విడుదల చేసిన సుదీప్ మాట్లాడాను "సినిమా చాలా రిచ్గా కనిపిస్తోంది. ఇంట్రడక్షన్ సాంగ్లో ఉపేంద్రగారి డాన్స్ చూసి
ఆశ్చర్యపోయా. 'కుటుంబ'లో ఆయన డాన్స్ బావుంటుంది. అప్పటి నుంచి ఆయన్ను ఇటువంటి డాన్స్ బీట్ సాంగులో చూడలని, ఇటువంటి స్టెప్పులు వేయాలని ఆశిస్తున్నా. ఇంట్రడక్షన్ సాంగ్
ట్రెండీగా ఉంది. ఇది చూశాక... ఉపేంద్రతో మళ్ళీ పోటీ పడాలనిపిస్తోంది. నాతో సహా చాలామందికి ఉపేంద్ర హార్డ్ వర్క్, అంకితభావం స్ఫూర్తినిస్తాయి. ఉపేంద్ర లెగసీ వల్లే ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లి మాకంటూ
ఒక పేరు సంపాదించుకుంటున్నాం. ఒక సినిమాకు దర్శకత్వం వహించి మళ్ళీ మాకు స్ఫూర్తిగా నిలవాలని ఉపేంద్రను కోరుకుంటున్నా. ఆయన రాజకీయాల్లో ఉన్నారని తెలుసు. కానీ, మరొక్కసారి
దర్శకత్వ బాధ్యతలు తీసుకోవాలని కోరుతున్నాను. ఆయనలాంటి దర్శకులు ఇండస్ట్రీకి అవసరం. చంద్రు, ప్రేమ్ వంటి దర్శకులకు ఆయనే స్ఫూర్తి. 'ఐ లవ్ యు' ప్రీ రిలీజ్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
ఉపేంద్ర, రచితా రామ్ పాత్రలు కాకుండా సినిమాలో ఇంకేదో ఉందనిపిస్తోంది. నేను రచితా రామ్ తో ఇంతకు ముందు నటించాను. ఫెంటాస్టిక్ గర్ల్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు సినిమా
జర్నలిస్టులకు థాంక్స్" అన్నారు. ఉపేంద్ర మాట్లాడుతూ "ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. నాకు సుదీప్ 25 ఏళ్లుగా పరిచయం. మా స్ట్రగులింగ్ డేస్ నుంచి ఒకరికొకరం తెలుసు. ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో అతడిలో ఎంత ఫైర్
ఉందో... ఇప్పుడూ అంతే ఫైర్ ఉంది. భాషలకు అతీతంగా అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు, హిందీ ప్రేక్షకులకూ సుదీప్ తెలుసు. సినిమా విషయానికి వస్తే... స్క్రిప్ట్ విన్నప్పుడు
థ్రిల్లయ్యా. దర్శకుడు చంద్రు అద్భుతమైన కథ రాసుకుని, పెద్ద కలలతో వచ్చాడు. రచితా రామ్ హాట్ అండ్ గ్లామరస్ హీరోయిన్. ఈ సినిమాతో కుర్రాళ్లను ఫినిష్ చేస్తుంది. ఇప్పుడు అందరూ చాలా
ఈజీగా 'ఐ లవ్ యు' చెబుతున్నారు... సినిమా సింబల్ చూపిస్తూ! థాంక్స్ టు దిస్ మూవీ" అన్నారు.
డింపుల్ క్వీన్ రచితా రామ్ మాట్లాడుతూ "ఇంతకు ముందు సినిమాల్లో నేను ఎప్పుడూ బోల్డ్ గా నటించలేదు. ఫర్ ఎ చేంజ్... ఈ సినిమాలో ఎరోటిక్ ఎపిసోడ్ చేశా. పాత్రలో పరకాయ ప్రవేశం
చేయడంతో ఆ సన్నివేశాలు చేయగలిగా. 'ఐ లవ్ యు' స్క్రిప్ట్ విన్న వెంటనే ఉపేంద్రగారికి ఫోన్ చేసి, నేను తప్పకుండా ఈ సినిమా చేస్తానని చెప్పాను. సినిమా చూసిన తరవాత బోల్డ్ సన్నివేశాల్లో
ఎందుకో నటించానో, కథలో వాటి ప్రాముఖ్యం ఏమిటో ప్రేక్షకులకు అర్థమవుతుంది" అన్నారు. సంగీత దర్శకుడు కిరణ్ తోటంబైల్ మాట్లాడుతూ "మా నాన్నగారు నన్ను ఎండి (వృత్తిరీత్యా డాక్టర్)
చదివించారు. దర్శకుడు చంద్రు నన్ను మరో ఎండి (మ్యూజిక్ డైరెక్టర్) చేశాడు. నాకు చంద్రు తండ్రి లాంటి వ్యక్తి. నా కెరీర్ బిగినింగ్ లో ఎంత పెద్ద సినిమాకు సంగీతం అందించే అవకాశం రావడం
సంతోషంగా ఉంది" అన్నారు.
కెపి శ్రీకాంత్, ఆర్కిటెక్ రాజ్ ప్రభాకర్, జాక్ మంజు, కెఎఫ్సి వైస్ ప్రెసిడెంట్ భామ హరీష్, ఛాయా విఎఫ్ఎక్స్ (హైదరాబాద్) ప్రెసిడెంట్ దాసరి రాజేష్, డా. ఆర్ నటరాజ్, రాజశేఖర్, రాజ్ కుమార్,
ముత్తన్న - హుబ్లీ, డిస్ట్రిబ్యూటర్లు రవిష్, చందన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.