యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
గురువారం నాడు జరిగే వైసీపీ అధినేత జగన్. ప్రమాణ స్వీకారానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ ద్వారకా తిరుమలరావు వివరించారు. స్టేడియం లోపల భద్రత, ట్రాఫిక్ మళ్లింపు,
పార్కింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. స్టేడియం మొత్తం సామర్థ్యం 30వేల మందికి ఉందని సీపీ వెల్లడించారు. స్టేడియం గ్రౌండ్లో 12వేలు, గ్యాలరీలో 18 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు
చేశామన్నారు. ప్రమాణ స్వీకారానికి 12వేల పాసులు జారీ చేస్తున్నట్టు సీపీ తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాక రాష్ట్రేతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రముఖులు, పెద్ద ఎత్తున
అభిమానులు తరలి రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ బందోబస్తుకు ఐదు వేల మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తు న్నారు.
ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పా టు ట్రాఫిక్ స్తంభించకుండా పలు కీలక చర్యలు చేప డుతున్నారు. శాంతి భద్రతల సమస్య
తలెత్తకుండా చూడ టంతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ గౌతమ్ సవాంగ్ నేతృత్వంలో విజయవాడ పోలీసు కమిషన ర్ ద్వారకా తిరుమలరావు,
ఇతర పోలీసు ఉన్నతా ధికారులు ప్రమాణ స్వీకారోత్సవ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇందిరాగాంధీ మైదానంతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతను చేపడుతున్నా రు.