యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఇడుపులపాయ లో మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులు అర్పించి ఆశీర్వాదం పొందారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్
సమాధిపై పూలమాల వేసి ఆయన కొద్దిసేపు మౌనంగా ప్రార్థనలు చేశారు. జగన్‌తో పాటు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పలువురు పార్టీ నేతలు ఉన్నారు. అంతకు ముందు ఇడుపులపాయ చేరుకున్న
జననేతకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్ జగన్‌ను కలుసుకునేందుకు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. వారందరికీ అభివాదం చేస్తూ ఆయన
ముందుకు కదిలారు. అంతకు ముందు జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇక సాయంత్రం ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్లో కడప విమానాశ్రయానికి
చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ బయల్దేరి వెళతారు.