యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్ర ప్రజలంతా ఆనందోత్సాహాలతో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసుకోవాలి. సీఎం ప్రమాణ శ్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకొని..జనం సహకరించాలని
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్యణం అన్నారు. మజ్జిగ పేకెట్లు, మంచినీటి సదుపాయం మెడికల్ వసతులు ఏర్పాటు చేసాం. రెండు స్టేజీ లు ఏర్పాటు చేసాం.మొదటి దానిపై గవర్నర్,
క్రొత్త సీఎం. చీఫ్ సెక్రెటరీ మాత్రం ఉంటారు.రెండో వేదికపై తెలం గాణ సీఎం కేసీఆర్..డీఎంకే చీఫ్ స్టాలిన్ లాంటి అతిధులు ఉంటారు. స్టేడియం ఇన్నర్ సర్కిల్ లో పాసులు ఉన్నవాళ్లు ..ఔటర్ సర్కిల్
లో పాస్ లు లేనివాళ్ళు సైతం కూర్చునేలా ఏర్పాటు చేసాం. నగరంలో సైతం ఎల్ఈడీ స్క్రీన్ లు పెడుతున్నాం.స్టేడియం కు రాలేని వాళ్ళు వాటి ద్వారా ముఖ్యమంత్రి ప్రమాణ శ్వీకారం చూడొచ్చు.
వీలైనంత నిరాడంబరం గా తన ప్రమాణ స్వీకారం ఉండాలనేది సీఎం ఆలోచన.దానికి తగ్గట్టు గానే ఏర్పాట్లు చేస్తున్నామని అయన అన్నారు.