YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

'ఈశాన్య' లో కౌంట్ డౌన్ స్టార్ట్..

Highlights

  •  త్రిపుర, 
  • నాగాలాండ్
  • మేఘాలయలలో
  • కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు 
'ఈశాన్య' లో కౌంట్ డౌన్ స్టార్ట్..

త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ  శనివారం మొదలైంది . మాకొద్దీ గంటల్లోనే  ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఎనిమిది గంటలకే ప్రారంభమైంది.మేఘాలయ, నాగాలాండ్‌లలో కూడా అరవై చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మూడు రాష్ట్రాల్లోను 59 స్థానాల్లోనే ఎన్నిక జరిగింది. ఎందుకంటే త్రిపురలో సీపీఎం అభ్యర్థి ఒకరు ఎన్నికలకు ముందు మృతి చెందారు. మేఘాలయలో ఓ ఎన్సీపీ అభ్యర్థి ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారు. నాగాలాండ్‌లో ఎన్డీపీపీ అధ్యక్షులు నెయిపుయి రియో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందరి దృష్టి కమ్యూనిస్టులకు కంచుకోట త్రిపుర పైనే ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ ఆ పార్టీదే ఆధిపత్యం. కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈసారి బీజేపీ గెలుస్తుందని చెప్పాయి. ఈ నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ కనిపించింది. మార్పు నినాదంతో బీజేపీ బరిలోకి దిగింది. నాలుగు దఫాలుగా సీఎం పదవిలో కొనసాగుతూ అవినీతి మరక అంటని మాణిక్ సర్కార్ సీపీఎం ప్రధాన బలం. ప్రధాన బలం సీపీఎం, బీజేపీల మధ్యనే ఉంది.
త్రిపుర, నాగాలాండ్‌లలో బీజేపీ, మిత్రపక్షాలు అధికారంలోకి వచ్చే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మేఘాలయలో హంగ్ ఏర్పడే అవకాశముంది. ముఖ్యంగా దశాబ్దాలుగా కమ్యూనిస్టు కోటాగా ఉన్న త్రిపురలో బీజేపీ గెలిస్తే ఆ పార్టీలో అది మరింత నూతనోత్సాహం నింపనుంది. ఇటీవల ఒకటి రెండు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. త్రిపురలో గెలిస్తే 2019 ఎన్నికలకు ముందు ఇది బీజేపీకి బూస్ట్ ఇవ్వనుంది. ఈశాన్యంలో ఏడు రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ ఇప్పటికే 3 రాష్ట్రాల్లో జెండాను ఎగరవేసింది. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో గెలుస్తారని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. త్రిపుర, నాగాలాండ్‌లలో బీజేపీ గెలుస్తుందని, మేఘాలయలో హంగ్ వస్తుందని ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడించాయి.


 

Related Posts