ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని వైసీపీ అధినేత జగన్ చంద్రబాబును కోరిన సంగతి తెలిసిందే. ఇటీవల చంద్రబాబుకు ఫోన్ చేసిన జగన్ ప్రమాణస్వీకారానికి
రావాలని కోరారు. మరోవైపు ఈరోజు టీడీపీ నేతలు చంద్రబాబును టీడీపీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి
హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు.
తనకు బదులుగా ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలతో కూడిన ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయించారు. కాగా, ఈ ఇద్దరు నేతలు గురువారం ఉదయం తాడేపల్లిలోని జగన్ ఇంటికి వెళ్లి
అభినందిస్తారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అనంతరం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతారు