YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజధాని ప్రాంతానికి సంబంధించి జగన్ సంచలన ఆదేశాలు!

 రాజధాని ప్రాంతానికి సంబంధించి జగన్ సంచలన ఆదేశాలు!

ఏపీ ఎన్నికలు ముగిశాయి. వైసీపీ విజయం సాధించింది. మే 30న విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ 
రాజధాని ప్రాంత రైతుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ చెప్పిన మాటను గుర్తుచేసుకుంటున్నారు. ల్యాండ్ పూలింగ్‌ను జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు. భూములను 
దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారని, తాను సీఎం కాగానే ఆ భూములను తిరిగిచ్చేస్తానని ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ మాటను నిజం చేయాలని ఏపీకి 
కాబోయే సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఇందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను అందించాలని ఏపీసీఆర్‌డీఏ 
కమిషనర్‌కు జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.రాజధాని ప్రాంతంలో ప్రైవేట్ వ్యక్తులు జరిపిన భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలతో పాటు పలు సంస్థలకు కేటాయించిన 
స్థలాలకు సంబంధించిన రిపోర్ట్‌ను కూడా జగన్ అడిగినట్లు సమాచారం. అంతేకాదు, ల్యాండ్‌పూలింగ్‌లో భాగంగా భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్స్ విషయంలో కూడా నివేదిక ఇవ్వాలని 
ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. 2014-15 మధ్య కాలంలో అంటే విభజిత ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో రాజధానికి సంబంధించి జరిపిన క్రయవిక్రయాలకు సంబంధించిన 
వివరాలను సమర్పించాలని జగన్ ఆదేశించినట్లు తెలిసింది. ఇలా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందే జగన్ రాజధాని ప్రాంతానికి సంబంధించిన నివేదికలు సమర్పించాలని జారీ చేసిన 
ఆదేశాలతో ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ రాజధాని రైతులతో పాటు రాష్ట్ర ప్రజల్లో కూడా నెలకొంది.

Related Posts