యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. బెంగాల్‌లో మృతిచెందిన 54 మంది వ్యక్తుల కుటుంబ సభ్యులను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించడంతో మమతా ఈ యూటర్న్ తీసుకున్నారు. హాజరుకాకపోవడగానికి గల కారణాలను లేఖలో పేర్కొన్నారు.''నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్రమోదీకి శుభాకాంక్షలు. రాజ్యాంగబద్దమైన ఆహ్వానాన్ని అంగీకరించి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని నిర్ణయించుకున్నాను. ఐతే గంట నుంచి.. బెంగాల్‌లో జరిగిన రాజకీయ అల్లర్లలో 54 మంది హత్యకు గురయ్యారని బీజేపీ చేసిన వ్యాఖ్యలు మీడియాలో వస్తుండగా చూశాను. ఇది పూర్తిగా అబద్ధం. ఆ మరణాలన్నీ కుటుంబ తగాదాలు, వ్యక్తిగత కారణాల వల్ల జరిగాయి. అందులో కొన్ని సాధారణ మరణాలు ఉన్నాయి. బెంగాల్‌లో ఎలాంటి రాజకీయ హత్యలు జరగలేదు. ఆ మరణాలతో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు.రాజకీయ హత్యలనడానికి ప్రభుత్వం దగ్గర రికార్డులు కూడా లేవు. అందుకే ఐ యామ్ సారీ నరేంద్రమోదీ జీ. ప్రమాణస్వీకారానికి రాలేకపోతున్నాను. ప్రమాణస్వీకారం అనేది ప్రజాస్వామ్య పండుగలాంటింది. అలాంటి వేడుక ఏ పార్టీని కించపరచే విధంగా ఉండకూడదని'' మమతా లేఖలో పేర్కొన్నారు