ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం పార్టీకి చెందిన ముఖ్య నేతలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్ ఇంకా కాబోయే సీఎం కాబట్టి సామాన్య భక్తుల మాదిరిగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రులు, గవర్నర్లు నేరుగా మహాద్వారం నుంచి ప్రవేశించి శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. కానీ, జగన్ ఇంకా సీఎంగా ప్రమాణం చేయలేదు కాబట్టి వీవీఐపీ దర్శన సమయంలో ఆయన వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. జగన్‌కు ఘనస్వాగతం పలికిన ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, అర్చకులు ఆయన్ని ఆలయంలోకి తీసుకెళ్లారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్‌ను ఆశీర్వదించారు. పూజలో జగన్‌తో పాటు విజయసాయి రెడ్డి, రోజా, భూమన కరుణాకర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇతర నేతలు కూర్చున్నారు. ఈ సందర్భంగా జగన్‌కు ఈవో సింఘాల్ స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. పట్టు వస్త్రంతో జగన్‌ను సత్కరించారు. స్వామి అమ్మవార్ల చిత్ర పటాన్ని అందజేశారు. దర్శనానంతరం తిరుమల నుంచి నేరుగా రేణుగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. అక్కడి నుంచి కడపకు వెళ్లారు. కడపలోని సీఎస్ఐ చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థనలు జరిపిన తరవాత అక్కడి నుంచి ఇడుపులపాయకు వెళ్లారు. ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించాకె. మళ్లీ సాయంత్రానికి అమరావతి చేరుకుని గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారు.
వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడపలోని పెద్ద దర్గాను సందర్శించారు. దర్గా వద్ద ఆయనకు ఘన స్వాగతం లభించింది. బుధవారం (మే 29) అమీన్‌పీర్ దర్గాకు విచ్చేసిన వైఎస్ జగన్‌కు దర్గా మతపెద్దలు సాంప్రదాయ రీతిలో తలపాగా చుట్టారు. దర్గాలో వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. చాదర్ సమర్పించారు. జగన్ వెంట పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు ఉన్నారు. జగన్ కలవడానికి అక్కడికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వైఎస్ జగన్ వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్.. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకున్నారు. కడప విమానాశ్రయం వద్ద వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అభిషేక్ మహంతితో పాటు జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ శాసనసభ్యులు, ఎంపీలు, పార్టీ శ్రేణులు జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. పెద్ద దర్గా సందర్శన అనంతరం వైఎస్ జగన్ అక్కడ నుంచి నేరుగా పులివెందుల బయలుదేరి వెళ్లారు. అక్కడి సీఎస్‌ఐ చర్చిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్‌ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు.పీ కాబోయే సీఎం జగన్ ఇవాళ ఇడుపులపాయ విచ్చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం కడప సీఎస్ఐ చర్చి, అమీన్ పీర్ దర్గాలను సందర్శించిన ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్దకు వచ్చారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ముఖ్యమంత్రి కాబోతున్న ఉత్సాహంలో ఉన్న జగన్ తండ్రి సమాధి వద్ద మాత్రం కాస్తంత బాధతో కనిపించారు. కించిత్ భావోద్వేగాలకు గురయ్యారు. తండ్రిని ఖననం చేసిన చోట మోకాళ్లపై కూర్చుని నివాళులు అర్పించారు.అంతకుముందు అక్కడున్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా, అక్కడికి వచ్చిన స్థానిక నేతలను పేరుపేరునా పలకరించారు. ఈ కార్యక్రమం అనంతరం జగన్ హెలికాప్టర్ లో విజయవాడ పయనం అయ్యారు.