కీర్తి సురేశ్ నాయికగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మహానటి' చిత్రం విడుదల వాయిదా పడినట్టు సమాచారం. మొదట్లో ప్రకటించినట్టు ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కావడం లేదని, వేసవి చివర్లో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. నెలాఖరుకి ఈ చిత్రం పనులు పూర్తికాకపోవడంతో పాటు, ఏప్రిల్ లో పెద్ద చిత్రాల విడుదల ఉండడంతో దీనిని వాయిదా వేసుకున్నట్టు చెబుతున్నారు.