యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలో హోరా హోరీగా జరిగిన వైసీపీ వర్సెస్ టీడీపీ ఎన్నికల్లో అనేక చిత్ర విచిత్ర పరిస్థితులు ప్రజలను ప్రభావితం చేశాయి. రాష్ట్రంలో ఎవరూ ఊహించని రీతిలో జగన్ సునామీ సృష్టించాడు. మొత్తం 175 అసెంబ్లీ స్తానాలు 25 పార్లమెంటు స్థానాల్లో 151, 22 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే, ఇంత సునామీని ముందుగా ఎవరూ ఊహించలేదు. ఫలితంగానే టీడీపీ పూర్తిగా చతికిలపడింది. అదే సమయంలో పోలీసు శాఖలో కీలకంగా ఎదిగిన అధికారులు తమ తమ ఉద్యోగాలను వదులకుని తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. తాము గెలిచి చట్టసభలకు వెళ్లాలనే కోరికతో రంగంలోకి దిగిన ఈ అధికారుల్లో ఒక్క సీఐ తప్ప మిగిలిన వారంతా పరాజయం పాలయ్యారు.విషయంలో కివెళ్తే.. వైసీపీ తరఫున అనంతపురంలోని హిందూపురం ఎంపీగా స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గోరంట్ల మాధవ్ పోటీ చేశారు. నామినేషన్ ఆఖరు రోజు వరకు ఆయన రిజైన్ లెటర్‌ను ఆమోదించకుండా టీడీపీ ప్రభుత్వం పెట్టిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. చివరికి హైకోర్టు జోక్యంతో చంద్రబాబు ప్రభుత్వం దిగివచ్చి మాధవ్ వీఆర్‌ను అంగీకరించింది. దీంతో ఆయన అక్కడి నుంచి చివరి నిమిషంలో పోటీ చేసి విజయాన్ని తన బుట్టలో వేసుకున్నారు. ఇక, విశాఖ ఎంపీగా జనసేన టికెట్ పోటీ చేశారుఐపీఎస్ మాజీ అధికారి, సీబీఐ మాజీ జేడీ.. వీవీ లక్ష్మీనారాయణ. ఇక్కడ నుంచి గెలిచి రాజకీయాలకే కొత్త భాష్యం చెప్పాలని ఆయన భావించారు. ప్రజలు మాత్రం ఆయనను మూడోస్థానానికే పరిమితం చేశారు. ఒక సీఐ గెలిస్తే.. ఒక ఐపీఎస్ అధికారి ఓడిపోవడం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. మరి దీనికి కారణం ఏంటి? అనేది ప్రధాన చర్చ. సీఐగా మాస్ ప్రజలను తన వైపు తిప్పుకోవడంలో మాధవ్ సక్సెస్ అయ్యారు. దీనికితోడు జగన్ సునామీకూడా బాగా వర్కవుట్ అయింది. ఇక పోలీస్ శాఖలో యంగ్, డైనమిక్ లీడర్‌గా పేరు తెచ్చుకున్న గోరంట్ల మాధవ్ బీసీ కావడం… హిందూపురం లోక్‌సభ పరిధిలో బీసీ జనాభా ఎక్కువుగా ఉండడం కూడా ఆయనకు ప్లస్. గత ఎన్నికల్లో ఈ సీటును రెడ్డి వర్గానికి ఇచ్చిన జగన్ ఇప్పుడు ప్రయోగం చేసి బీసీలకు ఇచ్చారు. మాధవ్ జేసీ దివాకర్‌రెడ్డి అంతటి వాడినే పోలీసుల జోలికొస్తే నాలుక చీరేస్తా అని వార్నింగ్ ఇవ్వడంతో యూత్‌లో ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది.అదే టైంలో జగన్ అనంత జిల్లాలోని రెండు ఎంపీ సీట్లు బీసీలకే ఇచ్చాడు. ఈ జిల్లాల్లో బోయ, కురుబ సామాజికవర్గానికి చెందిన జనాభా ఎక్కువ. మాధవ్ కురుబ కాగా, అనంత ఎంపీగా గెలిచిన రంగయ్య బోయ. దీంతో ఈ రెండు సామాజికవర్గాల జనాభా వైసీపీకే జై కొట్టారు. అదే సమయంలో క్లాస్ గా పేరు తెచ్చుకున్న లక్ష్మీనారాయణ మాస్‌కు చేరువ కాలేక పోయారు. విశాఖ ఎంపీ పరిధిలోని చాలా నియజకవర్గాల్లో టీడీపీ గెలిచినా.. ఆయన మాత్రం ఓటమి చవి చూశారు. ప్రధానంగా మాస్ జనాలు ఆయనను విశ్వ సించలేదు. దీనికితోడు ఆయన ప్రజల్లో కలవలేక పోయారు. ఆయన వ్యవహార శైలి కూడా ప్రజలను కలుపుకొని పోయేలా చేయలేదు పవన్ ముందుగా విశాఖ ఎంపీ సీటు మరో వ్యక్తికి ఇవ్వడం.. ఆ వ్యక్తి సీటు ఇచ్చాక వైసీపీలోకి జంప్ చేయడం జరిగిపోయాయి. ఆ తర్వాత పవన్ లక్ష్మీనారాయణకు అక్కడ సీటు ఇవ్వడం కూడా మైనస్ అయ్యింది. అంతెందుకు అదే ఎంపీ పరిధిలో గాజువాక నుంచే పవన్ అసెంబ్లీకి పోటీ చేసినా ఓడిపోయారు. మొత్తానికి తన పరాజయాన్ని తనే తెచ్చుకున్నారు. పవన్ మ్యానియా ఉంటుందని అనుకున్నా .. అది ఎక్కడా కనిపించకపోవడం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది.