ప్రముఖ దర్శకుడు మణిరత్నంను బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు లైఫ్ టైం ఎఛీవ్ మెంట్ అవార్డుతో సత్కరించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా ఈ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా తనకు అందజేసిన 10 లక్షల నగదును కర్ణాటక చలన చిత్ర అకాడమీకి మణిరత్నం తిరిగి విరాళంగా ఇచ్చేశారు.