
యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
క్రికెట్ అభిమానులకు మరో క్రికెట్ పండుగ వచ్చేసింది. ఐపీఎల్ ముగిసి నెల రోజులు కూడా కాకుండానే వరల్డ్ కప్ మొదలైంది ప్రపంచకప్ 2019కి మరికొద్ది గంటలే సమయముంది. ఓవల్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో దక్షిణాఫ్రికా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో తలపడనుంది. నేటితో ప్రారంభమయ్యే 12వ వన్డే ప్రపంచకప్ జులై 14న ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ముగుస్తుంది. దీంతో ఎవరెవరు ఎలా ఆడతారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇంగ్లాండే ఫేవరెట్‌గా ఉన్నా టీమిండియా, ఆస్ట్రేలియా జట్లనూ తక్కువ చెయ్యలేని పరిస్థితి.