యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 12.23 గంటలకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, జగన్ తో ప్రమాణం చేయించారు. ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం పూర్తవగానే జగన్ వేదికపైనే ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సంతకం పెట్టారు. ఈ కార్యక్రమానికి జగన్ కుటుంబ సభ్యులతో పాటు కేసీఆర్, స్టాలిన్ తదితరులతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, భారీ ఎత్తున ప్రజలు, అభిమానులు తరలివచ్చారు.