YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తెలంగాణలో దూకుడు పెంచిన కమలం

తెలంగాణలో దూకుడు పెంచిన కమలం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:   
 

నరేంద్రమోడీకి రాజకీయం మినహా మరేమీ అక్కర్లేదు. ఎప్పటికేది ప్రస్తుతమో అప్పటికామాటలాడి అన్నట్లు మోడీ కాంటెంపరరీ నిర్ణయాలు, కాంటెంపరరీ రాజకీయాలు చేస్తూ ఉంటారు. వర్తమానంలో 
 ఎంత బలంగా ఉంటే భవిష్యత్తు అంత భద్రంగా ఉంటుందని మోడీ ఆలోచిస్తారు. ఎపుడు కావాలంటే అపుడు మనసు మార్చకోగలిగిన రాజకీయ నాయకులు ఉన్నపుడు భవిష్యత్తు కోసం ఇప్పటి 
నుంచే ఎవరితోనూ రిలేషన్స్ మెయింటెయిన్ చేయాల్సిన అవసరం ఏముంది అన్నది మోడీ ఆలోచన. అవసరమైనపుడు ఆయా నేతల, పార్టీల వీక్ నెస్ ల ఆధారంగా వారిని వాడుకోవచ్చు అని  మోడీ నిశ్చిత అభిప్రాయం. ఇలాంటి ఒక రాజకీయం తెలంగాణ ఎన్నికల్లో జరిగింది. అదేంటో చూద్దాం.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మోడీ- కేసీఆర్ రహస్య ప్రేమాయణం నడిపారు. ఒకరికి ఒకరు సహకరించుకున్నారు. తన తాత్కాలిక ప్రయోజనాలు త్యాగం చేసి మరీ బీజేపీ కేసీఆర్ పార్టీకి   వంద శాతం అండగా నిలబడింది. అయితే, ఆ రోజు లెక్కలు వేరు. కాంగ్రెస్ గతంలోకంటే పుంజుకుందేమో... దానిని టీఆర్ఎస్ తో కలిసి చంపేద్దాం... మిగతా విషయాలు తర్వాత చూసుకోవచ్చన్న   ధోరణిలో ముందుకు వెళ్లింది బీజేపీ. సోషల్ మీడియాలో అప్పట్లో టీఆర్ఎస్ వాళ్లు బీజేపీ వాళ్లు రాసుకుపూసుకుతిరిగారు. బీజేపీ సహకరించడం వల్ల టీఆర్ఎస్ కు చాలా లాభం చేూకురుతుంది. అది  బీజేపీకి ఉపయోగం ఏమీ ఉండదు. అయినా వాళ్లు సహకరించారు. అందుకే ఉద్యమ సమయంలో రానన్ని సీట్లు ఐదేళ్ల తర్వాత వచ్చాయి. ఇక్కడ బీజేపీ వల్ల కలిగిన ఉపయోగం ఓటుబ్యాంకు కాదు.  అనేక ఇతరత్రా ఉపయోగాలు కలిగాయి. సహజంగానే కేంద్రం అండ ఉన్న రాష్ట్రానికి అనేక అదనపుబలాలు చేకూరుతాయి కదా. అలాగన్నమాట. ఎన్నికలు ముగిసి ఎపుడైతే కాంగ్రెస్ మునుపటి కంటే   బలహీన పడిందని మోడీ భావించారో ఇక అప్పట్నుంచి కేసీఆర్ ను పట్టించుకోవడం మానేశారు. ఎందుకంటే... కాంగ్రెస్ బీజేపీ స్థాయికి వచ్చింది. ఇపుడు రెండూ సమాన స్థాయిలో ఉన్నాయి. (స్థాయి  అంటే ఇక్కడ సీట్లు, ఓట్లు కాదు. రాష్ట్రంలో పార్టీ బజ్ కి సంబంధించింది) కేంద్రంలో బీజేపీకి అధికారం ఉంది. అలాంటపుడు కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ బదులు తాము అవతరించాలని 
 బీజేపీ భావించింది. అందుకే టీఆర్ఎస్ ను మోడీ అండ్ కో త్యజించారు. దీని ప్రభావం ఎంత దారుణంగా ఉందో గత లోక్ సభ ఫలితాలు చెప్పేశాయి. బీజేపీ తాను అనుకున్నట్లే కాంగ్రెస్ పార్టీ కంటే కొంచెం మెరుగయ్యింది. ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవని రాష్ట్రంలో 4 ఎంపీ సీట్లు గెలవడం అంటే మాటలు కాదు. చివరకు దేశంలో పవర్ ఫుల్ సీఎం అని అందరూ చెప్పుకునే కేసీఆర్ కూతురినే బీజేపీ  ఓడించింది. దీంతో కేసీఆర్ కలలు అన్నీ కకాకవికలం అయ్యాయి. లోక్ సభ ఎన్నికలకు ముందు.. మోడీకి నేను అవసరం గాని, నాకు మోడీ అవసరం లేదనే భ్రమల్లో ఉన్నాడు కేసీఆర్. ఎపుడైతే   తిరుగులేని మెజారిటీ బీజేపీకి వచ్చిందో, కూతురు బీజేపీ చేతిలో ఓడిపోయిందో... అంతే కేసీఆర్ కలలన్నీ పటాపంచలు అయిపోయాయి. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ అని ఎగిరిన కేసీఆర్... ‘‘తెలంగాణ  సీఎం సీటు మిగిల్తే చాలురా నాయనా’’ అనే స్థితికి వచ్చేశాడు. బీజేపీ ఆపరేషన్ తెలంగాణలో చాలా వేగంగా జరుగుతోంది. దక్షిణాదిన బలపడాలని చూస్తున్న భారతీయ జనతాపార్టీకి కర్ణాటకలో  పెద్ద సంఖ్యలో దక్కినసీట్ల కంటే తెలంగాణలో వచ్చిన నాలుగు సీట్లే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చాయి. అంటే... అన్నీ కలిసొస్తే ప్లాన్ వర్కవుటైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నుంచి అధికారం చేపట్టాలని అమిత్ షా, మోడీ కలలు కంటున్నారు. అంటే తమ లాభం తీరాక తెలంగాణ దొర తెప్పను బీజేపీ ఏట్లో పడేసింది. ఇంకా ఇపుడే మొదలైంది. ముందుంది మొసళ్ల పండగ.

Related Posts