YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

2 కోట్లుకు నో చెప్పిన ఫిదా పోరి

2 కోట్లుకు నో చెప్పిన ఫిదా పోరి

యువ్ న్యూస్  ఫిల్మ్ బ్యూరో:  
ఒక యాడ్ చేస్తే రూ.2 కోట్ల రెమ్యున‌రేష‌న్. మాట వినేందుకే చాలా టెంప్టింగ్ గా ఉంది క‌దా? అలాంటిది ఏకంగా డీల్ ముందుకు వ‌స్తే.. ఎవ‌రు మాత్రం సై అన‌కుండా ఉంటారు. అంద‌రి సంగ‌తి త‌ర్వాత‌.. 
 ఫిదా పోరి సాయిప‌ల్ల‌వి మాత్రం ఇలాంటిప‌నే చేసిన‌ట్లుగా ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు చెందిన వార్త ఒక‌టి స్ప‌ష్టం చేస్తోంది.ప్రేమ‌మ్ తో ఎంట్రీ ఇచ్చినా.. ఫిదాతో తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచేసింది సాయి ప‌ల్ల‌వి. సౌత్ లో బిజీగా ఉన్న ఆమె.. తనను తాను క‌వ‌ర్ చేసుకోవ‌టానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. తెలుగు.. త‌మిళం.. ఇలా వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకెళుతున్న ఆమెకు.. ఒక ఫెయిర్ నెస్ క్రీం వారు త‌మ యాడ్ లో న‌టిస్తే రూ.2కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇస్తాన‌ని ఆఫ‌ర్ ఇస్తే.. ఆమె మాత్రం నో చెప్పేసింద‌ట‌. ఎందుకంటే.. క్రీం రాసుకుంటే తెల్ల‌గా అవుతార‌ని చెప్ప‌టం ఏమిటి? తెల్లోళ్లు తెల్ల చ‌ర్మం ఉంటుంది. ఆఫ్రిక‌న్స్ కు వారి రంగు వారికి ఉంటుంది. అలాంట‌ప్పుడు మ‌న చ‌ర్మానికి ఉండే రంగు   మ‌న‌కుంది. అలాంటి మ‌నం తెల్ల‌గా ఉండాలంటే క్రీం రాసుకొని చెప్ప‌టం ఏమిటి? అంటూ ప్ర‌శ్నించార‌ట‌. అంతేకాదు.. అలాంటి యాడ్స్ చేసినందుకు వ‌చ్చే డ‌బ్బుతో ఏం చేయ‌గ‌ల‌ను? ఇంటికెళ్లి మూడు చ‌పాతిలు తిని.. కారులో షికారు చేస్తాను. అంత‌కంటే పెద్ద అవ‌స‌రాలు నాకు లేవు. అలాంట‌ప్పుడు ఆ  డ‌బ్బును నేనేం చేసుకోను? అంటూ తేల్చేసింద‌ట‌. ఆఫ‌ర్ల‌ను డ‌బ్బుతో మాత్ర‌మే చూసే వారికి సాయిప‌ల్ల‌వి లాంటోళ్ల నిర్ణ‌యాలు ఒక ప‌ట్టాన అర్థం కావు. ఏమైనా.. తాను న‌మ్మిన దాని మీద 
 నిలబ‌డ‌ట‌మే కాదు.. అలా ఉండ‌టం కార‌ణంగా కోట్లు పోతున్నా.. లైట్ తీసుకోవ‌టం సాయి ప‌ల్ల‌వి లాంటోళ్ల‌కు మాత్ర‌మే చెల్లుతుంది

Related Posts