యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా 12 గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలోని మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్లో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బీమి రెడ్డి వైసిపి నాయకులు మాధవరం రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. భీమ్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు త్వరలోనే వైయస్సార్ సిపి పార్టీ తరఫున
విజయం సాధించిన ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేస్తారని బాల నాగిరెడ్డి గారు కూడా మంత్రాలయం నియోజకవర్గం లో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లో ఆడిటర్ శంకర్ ర్ వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.