ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభావేదికపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు. వయసు చిన్నది కానీ, బాధ్యత పెద్దది. బాధ్యతలను అద్భుతంగా నిర్వహించగలిగిన శక్తి, సామర్థ్యం ఉందని గత తొమ్మిదేళ్లలో నిరూపించారు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి. తండ్రి అడుగుజాడలలో నడుస్తూ ప్రజారంజకంగా ఏపీలో పాలన సాగిస్తారని కేసీఆర్ అన్నారు. ఉభయ తెలుగు
రాష్ట్రాల మధ్యా సంబంధాలు బలోపేతమౌతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి జలాల వినియోగం వందశాతం జరగాలి. కృష్ణానది నీటి విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. జగన్ కు అద్భుతమైన అవకాశం ప్రజలు ఇచ్చారు. చాలా సంతోషం. మీ నాన్నగారి పేరును నిలబెట్టాలి. మూడు.. నాలుగు టర్మ్ల వరకూ మీ పరిపాలన సాగాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’ అని అన్నారు.