YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అవినీతి లేని పాలన అందిస్తా! మేనిఫెస్టోను పవిత్రంగా భావిస్తా..!

అవినీతి లేని పాలన అందిస్తా! మేనిఫెస్టోను పవిత్రంగా భావిస్తా..!

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం భావోద్వేగంతో మాట్లాడారు. ఆకాశమంత విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ సీఎం పదవిని స్వీకరిస్తున్నాను అని జగన్ ఈ సందర్భంగా చెప్పారు. 3648కి.మీ. ఈ నేలపై నడిచినందుకు మీలో ఒకడిగా నిలిచినందుకు ఆకాశమంతా విజయాన్నందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని జగన్ భావోద్వేగంతో మాట్లాడారు.రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందిస్తానని వేదికపై నుంచి ప్రజలకు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలోని జన్మభూమి 
కమిటీలపై విమర్శలు చేసిన ఆయన.. ప్రభుత్వ పథకాలు, సేవలు ఏ ఒక్కరికీ అందకపోయినా నేరుగా ప్రభుత్వానికే పిర్యాదు చేసేవిధంగా ఆగస్టు 15నాటికి కాల్ సెంటర్ ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుసంధానం చేస్తామన్నారు.అవినీతి నిర్మూలన కోసం పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు వ్యవస్థలను ప్రక్షాలన చేస్తానని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. గత ప్రభుత్వ హాయంలో అవినీతికి పాల్పడిన సంస్థలకు సంబంధించిన కాంట్రాక్టులను రద్దు చేస్తామని ఆయన వెల్లడించారు. కాంట్రాక్ట్ పనులలో రివర్స్ టెండరింగ్ ప్రాసెసింగ్‌ను తీసుకొచ్చి.. మిగులు నిధుల గురించి ప్రజలకు తెలిసేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో అమలవుతున్న విద్యుత్ రేట్లను తగ్గిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.నా పాదయాత్రలో పేదల కష్టాలు చూశా.. ప్రజల కష్టాలు విన్నాను. నేనున్నానని మీ అందరికి చెబుతున్నాను. అందరి ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రజల కష్టాలను తీర్చేందుకు రెండే రెండు పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చాం. గత ప్రబుత్వాల మాదిరిగా పేజీల కొద్ది మేనిఫెస్టో తీసుకోలేదు. మా మేనిఫెస్టోలో కులానికో పేజీ తీసుకురాలేదు. మేనిఫెస్టోను పవిత్రంగా భావిస్తాను. మేనిఫెస్టో ఆధారంగా పరిపాలిస్తానని 
మాట ఇస్తున్నాను అని జగన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. జగన్ మాట్లాడుతున్నంత సేపు అభిమానులు, కార్యకర్తలు ఈలలు కేకలు నినాదాలతో హోరెత్తించారు.జ్యుడిషియల్ కమిషన్‌ ఏర్పాటుకు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలుస్తానని జగన్మోహన్ రెడ్డి అన్నారు. కమిషన్‌ ఏర్పాటుకు ఓ జడ్జిని కేటాయించమని కోరుతానన్నారు. జ్యుడిషియల్ కమిషన్‌ ఆధీనంలో కాంట్రాక్టుల మానిటరింగ్‌ జరుగుతుందన్నారు. జ్యుడిషియల్ కమిషన్‌ ద్వారానే టెండర్లను పిలుస్తామని జగన్‌ స్పష్టం చేశారు. ఎక్కడైనా ఏ మీడియా అయినా వక్రీకరించి వార్తలు రాస్తే పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. 6నెలల నుంచి ఏడాది సమయం ఇవ్వండి.. ప్రక్షాళన చేస్తానని జగన్ స్పష్టం చేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ లబ్దిదారుల ఇంటికి నేరుగాడోర్ డెలివరీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో లంచాలు లేని పరిపాలన అందిస్తామని జగన్ హామీ 
ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేవలు ఏ ఒక్కరికీ అందకపోయినా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు ప్రజలకు ముఖ్యమంత్రి కార్యాలయానికే నేరుగా ఫిర్యాదు చేసేలా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి కాల్ సెంటర్‌ను అనుసంధానం చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. పైరవీలు, లంచాలు లేకుండా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందిస్తామని జగన్ పేర్కొన్నారు. నవరత్నాలు ప్రతి ఒక్కరికీ అందిస్తామని ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ అన్నారు.లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులు వేస్తామని ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందాలే చూస్తానన్నారు. సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి అందాలని.. రాజకీయాలు.. పార్టీలంటూ తేడా చూడకూడదన్నారు. ఆగస్టు 15 నాటికి గ్రామ వాలంటీర్లుగా4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి.. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమిస్తామని సీఎం జగన్ తేల్చిచెప్పారు. గ్రామాల్లో చదువుకున్న.. సేవ చేయాలనుకునేవాళ్లే వాలంటీర్లు. వాలంటీర్లకు రూ.5 వేలు జీతం ఇస్తాం. ప్రజలకు చెందాల్సిన ఏ పథకంలోనూ కక్కుర్తి ఉండకూడదన్నారు. గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసిన 72గంటల్లోగా నవరత్నాలు అందేలా చేస్తాం. నవరత్నాలను తూచా తప్పుకుండా అమలు చేస్తాం అని సీఎం జగన్‌ సభా వేదికగా హామీ ఇచ్చారు.నవరత్నాలు తూచ తప్పకుండా పాటిస్తానని సభావేదికగా సీఎం జగన్ హామీ ఇచ్చారు.
నా తల్లిదండ్రులకు పాదాభివందనం!సంక్షేమ పథకాలు అందరూ నావాళ్లే అని భావిస్తాను. చెరగని చిరునవ్వుతో ఆప్యాయతలు చూపించి.. నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆశీర్వదించిన దేవుడికి, నాన్నగారికి, నా తల్లికి పాదాభివందనం చేస్తూ మీ అందరికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానుఅని సీఎం తన ప్రసంగం ముగించారు.
భావోద్వేగంతో విజయమ్మ కంటతడి..ప్రసంగం అనంతరం తన తల్లి విజయలక్ష్మిని కౌగిలించుకున్నారు. భావోద్వేగంతో ఆమకంటతడిపెట్టేశారు. అనంతరం ఆమె కన్నీరు తుడిచిన జగన్ స్టేజ్‌పై నుంచి కిందికి తీసుకెళ్లారు. సభికులు, కార్యకర్తలు, అభిమానులు, అతిథులకు అభివాదం చేస్తూ జగన్.. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి నేరుగా తాడేపల్లిలోని తన స్వగృహానికి చేరుకున్నారు.

Related Posts