ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే జగన్ తన పాలనపై పట్టు పెంచుకునేందుకు సీఎంవో అధికారులపై బదిలీ వేటు వేసారు. చంద్రబాబు టీమ్‌ను టార్గెట్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎంవో కార్యాలయంలో చాలా కాలంగా పని చేస్తున్న ఉన్నతాధికారులందరిపై బదిలీ వేటు పడింది. ముఖ్యమంత్రి కి ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న సతీష్ చంద్రతోపాటు ముఖ్యకార్యదర్శి సాయి ప్రసాద్, కార్యదర్శి గిరిజా శంకర్‌తోపాటు అడుసుమిల్లి రాజమౌళి లను బదిలీ చేస్తూ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేసారు వారిని సాధారణ పరిపాలనకు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి.