యువ్ న్యూస్ జనరల్ బ్యూరో
ఇండియన్ స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. బెంచ్‌మార్క్ సూచీలు గురువారం భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 330 పాయింట్ల లాభంతో 39,832 పాయింట్లకు చేరింది. ఇక నిఫ్టీ 85 పాయింట్ల లాభంతో 11,946 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. దీంతో రెండు సూచీలకు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి.
నిఫ్టీ 50లో ఎన్‌టీపీసీ, యస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, గెయిల్, ఎస్‌బీఐ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో ముగిశాయి. యస్ బ్యాంక్ 2 శాతానికి పైగా లాభపడింది. అదేసమయంలో సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఎంఅండ్ఎం, ఓఎన్‌జీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, వేదాంత, భారతీ ఇన్‌ఫ్రాటెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టపోయాయి. సన్ ఫార్మా 3 శాతంమేర పడిపోయింది. రూపాయి క్షీణత ఐటీ స్టాక్స్‌కు కలిసొచ్చింది. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు మినహా మిగతావన్నీ లాభాల్లోనే క్లోజయ్యాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ రంగ షేర్లు బాగా ర్యాలీ చేశాయి.