Highlights
- నిన్న కవిని ఇప్పుడు నీతిమాలినదాన్నయ్యా
- విమర్శలపై స్పందించిన నటి గిలూ జోసెఫ్
బిడ్డకు పాలిస్తున్న పోజిచ్చినందుకు తాను నయా పైసా కూడా తీసుకోలేదని, అది పబ్లిక్ స్టంట్ ఎలా అవుతుందని ప్రశ్నించింది.తన ఫొటోపై దుమారం చెలరేగడంతో గిలు జోసెఫ్ స్పందించింది. గ్రాఫిక్ ఫొటోలను చూడడాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారని, అటువంటి చూడడంలో వారికి ఎటువంటి ఇబ్బందీ లేదని, కానీ ఓ తల్లి తన బిడ్డకు పాలిస్తూ కనిపిస్తే మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించింది. నిన్నటి వరకు తనను గొప్ప కవిగా పొగిడిన వారే నేడు నీతి తప్పిన దానిగా, వేశ్యగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.బిడ్డకు బహిరంగంగా పాలివ్వడంపై కొందరు మండిపడ్డారు. పెళ్లికాని నటి ఇటువంటి ఫొటో షూట్‌లు చేయడమేంటని ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు. ఇదంతా పబ్లిక్ స్టంట్ అని తూర్పారబట్టారు. అంతేకాదు.. పలువురు ఆమెపైనా, ఆ ఫొటోను ప్రచురించిన మేగైజన్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.