యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నరేంద్రమోదీ.. గురువారం రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఘనంగాఈ వేడుక నిర్వహించారు. మోడీ ప్రమాణానికి బిమ్‌స్టెక్ దేశాల అధినేతలతోపాటు రాజకీయ, వ్యాపార, క్రీడా, సినీ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నరేంద్ర మోడీ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రధాని మోదీతోపాటు పలువురు మంత్రివర్గ సహచరులతో ప్రమాణం చేయించారు.ఉదయం మోదీ.. మహాత్మాగాంధీ, వాజపేయి స్మారకాల వద్ద నివాళులు అర్పించారు. మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి బిమ్‌స్టెక్ దేశాల ప్రతినిధులతో సహా మొత్తం ఎనిమిది వేల మంది హాజరయ్యారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, మయన్మార్ అధ్యక్షుడు యూ విన్ మైంట్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, భూటాన్ ప్రధాని లోటై షెరింగ్, థాయిలాండ్ ప్రత్యేక ప్రతినిధి గ్రిసా బూన్రచ్, బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఈ వేడుకలో పాల్గొననున్నారు. వీరితోపాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేత గులాంనబీ ఆజాద్, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు, వివిధ రాష్ర్టాల సీఎంలు, వివిధ రంగాల ప్రముఖులు, నేతలు, కార్యకర్తలు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా అనిల్ అంబానీ, గౌతమ్ అదాని, రతన్ టాటా, రాహుల్ ద్రావిడ్, సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షారుఖ్ ఖాన్, కంగనారనౌత్, రజినీకాంత్ వంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. పశ్చిమబెంగాల్‌లో చెలరేగిన రాజకీయ అల్లర్లలో హత్యకు గురైన దాదాపు 40 మంది బీజేపీ కార్యకర్తల కుటుంబాలు ఈ వేడుకకు హాజరయ్యారు.ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం అతిథులందరికీ విందు ఏర్పాటు చేశారు. విదేశీ ప్రతినిధులతోసహా ముఖ్యమైన 40 మంది అతిథులకు రాష్ట్రపతి ప్రత్యేక విందు ఇచ్చారు. బిమ్‌స్టిక్ దేశాధినేతలతోపాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ తదితరులు ఈ విందుకు హాజరుకాగా.... రాత్రి 9 గంటలకు విందు ప్రారంభమైంది, వీరికోసం ప్రత్యేకంగా దాల్ రైసినాను వడ్డించనున్నట్టు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. దీని తయారీకి కావాల్సిన పదార్థాలను లక్నో నుంచి ప్రత్యేకంగా తెప్పించామన్నారు. దీంతోపాటు శాఖాహార, మాంసాహార వంటకాలు ఉంటాయన్నారు. మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి బిమ్‌స్టెక్ దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరుకాగా... ఇలా వీరంతా కలిసి ఒక ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావడం ఇదే మొదటిసారి. 2014లో మోదీ సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి స్వదేశీ, విదేశీ ప్రతినిధులు కలిపి మొత్తం 8,000 మంది హాజరయ్యారు. ఇదో రికార్డుగా నిలువనున్నది. 2014లో దాదాపు 5000 మంది హాజరయ్యారు. రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలో ఆరుబయట ప్రమాణం చేయనున్న ఆరో ప్రధానిగా, మూడో వ్యక్తిగా మోదీ నిలువనున్నారు. గతంలో మాజీ ప్రధానులు చంద్రశేఖర్(1990), వాజపేయి(1996, 1998, 1999) ఆరుబయటే ప్రమాణం చేశారు. పశ్చిమబెంగాల్‌లో చెలరేగిన రాజకీయ అల్లర్లలో హత్యకు గురైన దాదాపు 40 మంది బీజేపీ కార్యకర్తల కుటుంబాలు ఈ వేడుకకు హాజరుకానున్నాయి. ఇలా కార్యకర్తల కుటుంబాలు ప్రధానమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావడం ఇదే మొదటిసారి..