యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జగన్ మంత్రి వర్గంలో చోటు కోసం వైసీపీ నేతలు పైరవీలు మొదలు పెట్టారు. జగన్ కు బాగా పరిచయం ఉన్న వారితో సిఫార్సులు చేయిస్తున్నారు. పక్క రాష్ట్ర సీఎం, స్వామీజీల దగ్గర ఆర్జీలు పెట్టుకుంటున్నారు. పార్టీలోని సీనియర్లు మొదలు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేల వరకు జగన్ ని ప్రసన్నం చేసుకుంనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరో పది రోజుల్లో మంత్రి వర్గం కొలువుదీరనుంది. దీంతో జగన్ క్యాబినేట్ లో బెర్త్ కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు ఎమ్మెల్యేలు. మంత్రివర్గంలో తమకు చోటు దక్కేలా వ్యూహా రచన చేస్తున్నారు. ముఖ్యంగా, జగన్ ఎవరి మాటకు విలువిస్తారో ఎవరి చేత సిఫార్సు చేయిస్తే, తమకు పదవి వస్తుందో ఆలాంటి వారిని రంగంలోకి దింపేందుకు తమకున్న పరిచయాలను ఉపయోగించుకుంటున్నారు. కృష్ణాజిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే పార్ధ సారది, తెలంగాణ సీఎం కేసీఆర్ తో మంత్రి పదవి కోసం సిఫార్సు చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. గతంలో సమైక్య రాప్ట్రంలో మంత్రిగా పని చేసిన పార్ధ సారదికి టీఆర్ఎస్ నేతలతో మంచి పరిచయాలు వున్నాయి. దీంతో తెలంగాణలోని ఓ సీనియర్ మంత్రి ద్వారా పార్ధసారది, కేసీఆర్ ని సంప్రదించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉంటున్నారు. తిరుమల పర్యటన సందర్బంగా సీఎం కేసీఆర్ స్వయంగా చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి ఇంటికెళ్లారు. దీంతో చెవిరెడ్డి కూడా మంత్రి పదవి కోసం కేసీఆర్ తో జగన్ కి సిపార్సు చేయిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. జగన్, స్వరూప నందేంద్ర స్వామి మాటకు ఆత్యంత విలువ ఇస్తుంటారు. పార్టీ అభ్యర్ధుల
ప్రకటన మొదలు ప్రమాణ స్వీకారానికి ముహార్తం వరకు ఆంతా స్వరూప నందేంద్ర చెప్పిందే జగన్ ఫాలో అవుతున్నారనే వాదన ఉంది. దీంతో నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి శారదా పీఠం స్వామిజీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక సీనియర్లతో పాటు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మంత్రి వర్గంలొ చోటు కోసం జగన్ కుటుంబ సభ్యులని ప్రసన్నం చేసుకోనే పనిలో ఉన్నారు. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో షర్మిళ, విజయమ్మ ప్రచారం చేశారు. వీటిలో పలు నియోజక వర్గాలలో చాలా చోట్ల వైసీపీ
నేతలు విజయం సాదించారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం ఎమ్మెల్యే జక్కం పూడి రాజా వైఎస్ విజయమ్మ ద్వారా మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాకినాడ సిటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి సైతం మంత్రి పదవి కోసం షర్మిళ, విజయమ్మ ద్వారా లాభియింగ్ చేస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సైతం మంత్రి పదవి కోసం విజయమ్మని సంప్రదించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఆనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ ఆమర్ నాధ్ కూడా శారదా పిఠం స్వామిజి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయితే పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు పలిస్తాయా సిపార్సులు వారికి కేబినెట్ లో బెర్త్ ను తెచ్చిపెడతాయో చూడాలి.