YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సిద్ధిరామయ్య, కుమారస్వామి శాంతి మార్గం

సిద్ధిరామయ్య, కుమారస్వామి శాంతి మార్గం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:   
 

కర్ణాటక సర్కార్ కూలిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి కుమారస్వామి సమాలోచనలు జరుపుతున్నారు. యడ్యూరప్ప సవాల్ ను ఇద్దరూ సీరియస్ గా తీసుకున్నారు. జూన్ 1నాటికి ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్న యడ్యూరప్ప వ్యాఖ్యలను అబద్ధం చేయాలని సిద్ధరామయ్య శ్రమిస్తున్నారు. ఇందుకోసం ప్రతి శాసనసభ్యుడికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ప్రధానంగా అసమ్మతితో ఉన్న నేతల వద్దకు ఆయన వెళ్లేందుకు సిద్దమవుతున్నారు.కర్ణాటకలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. భారతీయ జనత పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. మోదీ ఈనెల 30వ తేదీన ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోదీ ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే 
ఆపరేషన్ స్టార్ట్ చేయాలని కమలం పార్టీ భావిస్తుంది.ఇప్పటికే కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు యడ్యూరప్పతో నేరుగా మాట్లాడినట్లు చెబుతున్నారు. వారికి యడ్డీ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. జూన్ మొదటి వారంలో ఎమ్మెల్యేలను రిసార్ట్ కు తరలించే యోచనలో కూడా బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో కుమారస్వామి, సిద్ధరామయ్య లు అసంతృప్త ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. కొందరికి మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా రమేష్ జార్ఖిహోళికి మంత్రి పదవి ఇస్తామన్న ప్రతిపాదనను ఆయన ముందుంచారు. అయితే ఆయన ఇందుకు అంగీకరించలేదని తెలసింది. అలాగే మరో అసంతృప్త నేత మహేష్ కుమటహళ్లికి కూడా మంత్రి పదవి ఆఫర్ అందినట్లు సమాచారం. ఈయన కొంత మెత్తబడినట్లు చెబుతున్నారు. అవసరమైతే ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న వారిని తొలగించి కొత్త వారిని తీసుకోవాలన్న నిర్ణయానికి కుమారస్వామి, సిద్ధరామయ్య వచ్చారు. ఈ మేరకు జాబితాను సిద్ధం చేస్తున్నారు.సిద్ధరామయ్య మాత్రం తమ పార్టీ నుంచి ఎవరూ 
వెళ్లరని పైకి చెబుతున్నా లోపల మాత్రం ఆందోళన చెందుతున్నట్లే కన్పిస్తుంది. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ హైకమాండ్ కు వివరించారు. పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన అధిష్టానం పార్టీ పెద్దలను కర్ణాటకకు పంపేందుకు సిద్ధమయింది. ఆపరేషన్ కమల్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. దీనికి మంత్రివర్గ విస్తరణ ఒక్కటే మార్గమని కాంగ్రెస్ భావిస్తోంది. కొత్త అసమ్మతులు తలెత్తేలోగా పాతవారిని బుజ్జగించడమే కాంగ్రెస్ వ్యూహమని తెలుస్తోంది. మరి బీజేపీ ఈసారైనా అధికారంలోకి వచ్చేందుకు ఛాన్స్ ఉందా? లేదా? అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.

Related Posts