YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పెన్షన్ల పెంపుదలపై ప్రభుత్వం జీవో జారీ

పెన్షన్ల పెంపుదలపై ప్రభుత్వం జీవో జారీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పెన్షన్ల పెంపుదలపై శుక్రవారం ప్రభుత్వం జీవో జారీచేసింది.ఈ క్రమంలో ప్రభుత్వం వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా వృద్ధుల పెన్షన్‌ వయస్సు 65 నుంచి 60 సంవత్సరాలకు కుదించారు. ఈ మేరకు శుక్రవారం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సర్కారు తొలి జీవో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అర్హులందరికీ జూలై 1 నుంచి కొత్త పెన్షన్‌ పథకం అందుతుంది.  వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పథకం కింద వృద్ధులకు రూ. 2250, వికలాంగులకు రూ. 3 వేలు, కిడ్నీ బాధితులకు రూ. 10 వేలు చెల్లిస్తారు.కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ప్రసంగించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి సంతకం వృద్ధులకు పింఛను పెంపు ఫైల్‌పై చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతూ ఈ ఏడాది జూన్‌ 1 వతేదీ నుంచి 2,250 పింఛను ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. దశలవారీగా రెండో ఏడాది మరో రూ.250, మూడో ఏడాది మరో రూ.250, నాల్గో ఏడాదికి పింఛను రూ.3 వేలకు పెంచుతానని వివరించారు. 

Related Posts