పశ్చిమగోదావరి జిల్లా జిల్లాలోని పలు వాటర్ ప్లాంట్లపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు జరిపారు. తాడేపల్లిగూడెం పట్టణం, నల్లజర్లలో ఉన్న మేఘా, డాల్ఫిన్ ప్లాంట్లను తనిఖీలు చేసారు. తాడేపల్లిగూడెం మేఘా ప్లాంట్ అనుమతులు రెన్యూవల్ చేయకపోవడంతో వెంటనే రెన్యూవల్ చెయ్యాలని లేకుంటే కేసు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నల్లజర్ల డాల్ఫిన్ ప్లాంట్లో లేబుల్స్ లేకుండా నీటిని నింపుతున్నట్లుగా గుర్తించారు. శుక్రవారం రాత్రి వరకు విజిలెన్స్ తనిఖీలు కొనసాగాయి.