యువ్ న్యూస్ జనరల్ బ్యూరో
తిరుమల శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు శ్రీనివాస కళ్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో శ్రీవారి కల్యాణాలను టీటీడీ నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ ఉత్సవాలు కనువిందు కలిగిస్తాయి. ఈ కళ్యాణోత్సవాల్లో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తనలు కూడా నిర్వహిస్తారు. టీటీడీ శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూన్ నెలలో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని 13 చోట్ల కళ్యాణాలు నిర్వహిస్తోంది. జూన్ 2న తమిళనాడులోని ధర్మపురి జిల్లా కేంద్రం నెడుమారన్ నగర్‌లోని సంఘమిత్ర మ్యారేజ్ హాల్లో శ్రీవారి కల్యాణం జరుగనుంది. ఇక తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఐదు చోట్ల జూన్ 3 నుంచి 7 వరకు కళ్యాణాలు జరగనున్నాయి. జూన్ 3న కరీంనగర్ జిల్లా కేంద్రం భగత్‌నగర్ అంజనాద్రి ఆలయ ప్రాంగణం, జూన్ 4న పెద్దపల్లి మండల కేంద్రం బసంతనగర్ రామాలయ ప్రాంగణం, జూన్ 5న వేములవాడ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలోనూ, జూన్ 6న ధర్మారం మండల కేంద్రం మార్కెట్ యార్డులో, జూన్ 7న చొప్పదండి మండల కేంద్రం ఉన్నత పాఠశాల మైదానంలోనూ శ్రీనివాస కళ్యాణం నిర్వహించునున్నారు. జూన్ 9 నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో శ్రీనివాస కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. జూన్ 9న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రామ్‌లీలా మైదానం, జూన్ 10న తిమ్మాజిపేట మండలం నేరెళ్లవారిపల్లి గ్రామం ఉన్నత పాఠశాల ప్రాంగణం, జూన్ 11న నార్వ మండలం నాగల్ కడ్మూరు గ్రామంలో రామాలయం, జూన్ 12న మక్తల్ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానం, జూన్ 13న బాలానగర్ మండలం చెన్నవేలి గ్రామంలోని శ్రీరామాలయం, జూన్ 14న షాద్‌నగర్ మండలం పాత గుంజిలో స్వామివారి కల్యాణం జరగనుంది.