YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇందిర తర్వాత నిర్మలానే

ఇందిర తర్వాత నిర్మలానే

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో 
 

నిర్మలా సీతరామన్.. సమకాలీన రాజకీయాల్లో ఈమె పేరు మారుమోగుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రక్షణ శాఖ మంత్రిగా పూర్తి స్థాయిలో సేవలు అందించిన మహిళగా పేరుకెక్కిన ఈమె ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించారు. భారత దేశ ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులయ్యారు. అలాగే కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా చూసుకోనున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఆర్థిక మంత్రిగా ఈ ఘనత దక్కించుకున్న మహిళగా నిలిచారు. ఇందిరా గాంధీ 1970-71లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 
మహిళా ఆర్థిక మంత్రులుగా ఇద్దరే.. 
ఇప్పటి వరకు పనిచేసిన దేశ ఆర్థిక మంత్రుల్లో వీరిద్దరే మహిళలు కావడం గమనార్హం. తమిళనాడులోని మదురైలో 1959 ఆగస్ట్ 18న జన్మించిన నిర్మలా సీతారామన్ కీలకమైన మంత్రిత్వ శాఖలను అధిరోహించే స్థాయికి ఎదగడం ఆదర్శనీయం. 
నిర్మలా సీతారామన్ తమిళనాడులోని తిరుచిరపల్లిలో ఉన్న సీతాలక్ష్మీ రామస్వామి కాలేజ్‌లో ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొందారు. ఈ సమయంలోనే 1986లో ఆంధ్రాకు చెందిన పరకాల ప్రభాకర్‌ను (నర్సాపురం) పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ లండన్ వెళ్లారు. తర్వాత మళ్లీ ఇండియాకు తిరిగొచ్చారు. వీరికి కూతురు ఉంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. నిర్మలా సీతారామన్ ఇదివరకే ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. వాణిజ్య శాఖ మంత్రిగా కూడా కొనసాగారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యులుగా కూడా ఉన్నారు. ఈమె 2006లో బీజేపీలో చేరారు. అప్పుడు నితిన్ గడ్కరీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. రక్షణమంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వహించిన నిర్మలా సీతారామన్.. రాఫెల్ ఒప్పందంపై విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ధీటైన సమాధానం ఇస్తూ, ప్రధాని మోదీకి బలమైన సహకారాన్ని అందించారు. 

Related Posts