YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీవారి అనుగ్రహంతో పులకిస్తున్న భక్తకోటి - కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు

శ్రీవారి అనుగ్రహంతో పులకిస్తున్న భక్తకోటి  - కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు

సనాతన హైందవ సంస్కృతిలో భగవంతుని పూజలో కొబ్బరికాయకు విశేష ప్రాముఖ్యత ఉంది. కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవారి ఆలయానికి అభిముఖంగా గల అఖిలాండం లేదా అఖండం వద్ద రాత్రింబవళ్లు భక్తులు కొబ్బరికాయలు కొట్టి స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు.  శ్రీవారి భక్తులు దర్శనానంతరం అఖిలాండం వద్దకు విచ్చేసి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ సమర్పించడం ఆనవాయితీ. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేందుకు రెండు ఇనుప కడ్డీలు ఉంటాయి. అఖిలాండం వద్దగల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం ఎదుట నిలబడి శ్రీవారి మహద్వార గోపురంతోపాటు ఆనందనిలయాన్ని భక్తులు దర్శిస్తుంటారు. సామాన్య భక్తులతో పాటు విఐపిలు సైతం ఇక్కడ నిలబడి స్వామివారిని ప్రార్థిస్తారు. భక్తులు కొబ్బరికాయ కొట్టడం వలన వారిలోని అహం బద్దలై, జ్ఞానం ప్రాప్తిస్తుందని నమ్మకం.  
శ్రీవారి ఆలయం లోపల కర్పూరం వెలిగించడం, కొబ్బరికాయలు సమర్పించడం చేయకూడదన్నది పండితుల మాట. బ్రహ్మోత్సవాల సమయంలో అఖిలాండం వద్ద నుంచి చూస్తే శ్రీవారి ఆలయం విద్యుద్దీపకాంతులతో శోభాయమానంగా గోచరిస్తుంది. కాలినడకన ఏడుకొండలను అధిరోహించే భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్న తరువాత అఖిలాండం వద్దకు చేరుకుని పూజలు చేయడంతో వారి పాదయాత్ర ముగిసినట్లవుతుందని కొందరి నమ్మకం. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్థం టిటిడి శ్రీవారి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద తక్కువ ధరకు కొబ్బరికాయలు, కర్పూరం విక్రయిస్తుంది. భక్తులు ఒక కొబ్బరికాయ, కర్పూరం రూ.25-  వంతున చెల్లించి, 24 గంటలు పొందుతున్నారు. ప్రతి రోజు 12 వేల నుండి 15 వే కొబ్బరికాయలు భక్తులు కొనుగోలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తద్వారా టిటిడికి రోజుకు 3 లక్షల నుండి 

4 లక్షలు ఆదాయం వస్తుంది. ఇందుకు అవసరమైన కొబ్బరికాయలను, కర్పూరంను టిటిడి మార్కెటింగ్ విభాగం కొనుగోలు చేస్తుంది. వీటిని విక్రయించేందుకు శ్రీవారి పోటుకు చెందిన నలుగురు 

సిబ్బంది, 3 షిప్ట్లలో 60 మంది శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారు.     అఖిలాండం వద్ద భక్తులు కొబ్బరిచిప్పలు సమర్పించేందుకు రెండు పెద్ద డ్రమ్ములుంటాయి. ప్రతి రోజు సాయంత్రం 4 గంటలకు 

నలుగురు శ్రీవారి ఆలయ సిబ్బంది సమక్షంలో 15 మంది అన్నప్రసాదం సిబ్బంది కొబ్బరిచిప్పలను సేకరించి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంకు తరలిస్తారు. ఈ సేకరించిన 

కొబ్బరిచిప్పలను మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పిఏసి-2, టిటిడి ఉద్యోగుల క్యాంటీన్, పద్మావతి విశ్రాంతి భవనాల సమూదాయం, ధర్మగిరిలోని వేద పాఠశాల, వకుళాభవనంలో 

వంట తయారీకి, శ్రీవారి పోటులో ప్రసాదాల తయారీకి వినియోగిస్తారు. ప్రధానంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం అల్పాహరంలో చట్నికి, మధ్యాహ్నం, రాత్రి 

భోజనంలో పచ్చడి, కర్రీ మసాలాకు కొబ్బరిని విరివిగా ఉపయోగిస్తారు. ప్రతిరోజూ వెయ్యి కిలోలకు తగ్గకుండా కొబ్బరిచిప్పలు ఇక్కడ పోగవుతుంటాయి.  అన్నప్రసాదాలకై మిగిలిన కొబ్బరిని, కొబ్బరి 

ఖాళీ చిప్పలను కాంట్రాక్టర్లు టిటిడి నిర్ణయించిన రుసుం చెల్లించి తీసుకు వెళతారు.  ఈ విధంగా శ్రీవారికి భక్తులు సమర్పించే కొబ్బరికాయలతో స్వామివారి అనుగ్రహంతో పాటు  భక్తులకు రుచికరమైన 

అన్నప్రసాదాల తయారీకి ఉపయోగిస్తున్నారు. 
కొబ్బరికాయ ప్రాశస్త్యం -
భారతదేశంలోని ఆలయాలలో పూజ ఆచారాలలో కొబ్బరి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పవిత్రమైనది, స్వచ్ఛమైనది, పరిశుభ్రమైనది. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కొబ్బరిపై ఉన్న గుర్తులు మూడు 

కన్నులతో కూడిన శివుడికి ప్రాతినిధ్యం వహిస్తాయని భావించబడుతున్నాయి, అందువల్ల మన కోరికలను నెరవేర్చడానికి ఇది ఉపయోగపడుతుంది.  ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే  కొబ్బరికాయ బాహ్య 

కవచం మానవుడి యొక్క స్థూల భౌతిక శరీరంతో, అంతర్ కవచాన్ని సూక్ష్మ శరీరంతో పోల్చవచ్చు. 

Related Posts