కేంద్ర మంత్రి వర్గం లో ప్రతాప్ చంద్ర సారంగీకి స్థానం లభించింది.కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పశుసంవర్ధక శాఖ మంత్రిగా నియమితులైనారు ప్రతాప్ చంద్ర సారంగీ గారు ప్రస్తుత లోకసభ లో ఎన్నికైన ఎంపీ లలో అత్యంత పేదవాడు. ఈయన ఓడిసా రాష్ట్రానికి కి చెందినా వాడు. ఆయనను అక్కడ ఓడిసా మోడీ అని పిలుస్తుంటారు. అయన యావత్ ఆస్థి మొత్తం 1.25 లక్షలు అందులో 70 వేల రూపాయలు అయన గుడిసె విలువ. అయన సైకిల్ వేల్యూ 1500 ల రూపాయలు. ఈయన అత్యంత పేద స్థితిలో వుండి కూడా ఏనాడు ప్రజలకు సేవ చేసే విషయం లో వెనుకడుగు వేయలేదు.కాగా ఆరెస్సెస్ ప్రచారక్‌గా గుర్తింపు పొందిన ప్రతాప్‌చంద్ర సారంగి ఒడియాతో పాటు సంస్కృత భాషలో కూడా అనర్గళంగా మాట్లాడగలరు. ఎదుటివారు ఎంతటి వారైనా తన వాగ్ధాటితో మెప్పించగల చతురులు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేడీ హవాను తట్టుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. గ్రామాల్లో సైకిల్‌పై తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకమయ్యే ప్రతాప్‌చంద్ర.. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలోనూ అదే పంథా అనుసరించారు. బీజేపీ టికెట్ సంపాదించిన ఆయన ఆటోలో ప్రచారం నిర్వహిస్తూ సామాన్యులకు చేరువయ్యారు. అదే విధంగా ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రతాప్‌చంద్రకు మద్దతుగా ప్రచార సభలో పాల్గొని ఆయనకు అండగా నిలిచారు. 10 సంవత్సరాలు ఎంఎల్ఏ గా వున్నా ఒక్క అవినీతికి పాల్పడలేదు. డబ్బుకు కక్కుర్తి పడి తప్పుడు పనులు చేయలేదు. మనకు ఇలాంటి రాజకీయ నాయకులూ కావాలి.