యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
కథానాయిక కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఓ దీక్ష చేబట్టింది. అదేమిటంటే, వంద రోజుల్లో ఫిట్ గా మారిపోవాలన్నది. 'నా బాడీని ఫిట్ గా వుంచుకోవాలనుకుంటున్నాను. అందులో భాగంగా వంద రోజుల గడువు పెట్టుకున్నాను. నా ట్రైనర్ పర్యవేక్షణలో ఈ వర్కౌట్స్ మొదలుపెట్టాను. చూద్దాం.. మరో వంద రోజుల్లో నా బాడీ ఎలా తయారవుతుందో' అని చెప్పింది కాజల్.