యువ్ న్యూస్ జనరల్ బ్యూరో
నైపుణ్యాభివృద్ధి సంస్థ రాష్ట్రవ్యాప్తంగా యువతకు శిక్షణ ఇచ్చిన తర్వాత వారిని ఇండస్ట్రీకి అనుసంధానం చేయాలన్న( ఉపాధి అవకాశాల గురించి) ఉద్దేశంతో
A)స్కిల్ కనెక్ట్ ద్వారా జిల్లాలో ఉన్న వారికి
B) కార్పొరేట్ కనెక్ట్ ద్వారా మిగిలిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అనేక చర్యలు చేపట్టడం జరిగింది.
అందులో భాగంగా సోషల్ మీడియా లో ప్రతిరోజూ జాబ్ బులిటెన్స్ ను యువతకు ఇవ్వడం జరుగుతోంది.
టాలెంట్ పూల్ ద్వారా శిక్షణ పొందిన వారందరినీ ఒక గ్రూపుగా చేయడం జరిగింది. వారి వారి అర్హతలను బట్టి మా కాల్ సెంటర్ వారు బల్క్ మెసేజ్ లు ద్వారా సమాచారం తెలియజేస్తారు. సందర్భోచితంగా జాబ్మేళాలు నిర్వహించడం జరుగుతోంది.జిల్లా వారీగా స్కిల్ కనెక్ట్ ద్వారా ఎప్పటికప్పుడు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు మొదలు పెట్టాము అందులో భాగంగా గత నెల లో జిల్లాల వారిగా ఉపాధి కల్పించే 477 కంపెనీల లో 11297 ఉద్యోగావకాశాలను గమనించటం, 119 స్కిల్ కనెక్ట్ డ్రైవ్ లను నిర్వహించడం జరిగింది రమారమి జిల్లాస్థాయిలో 4400 మంది ఇంటర్వ్యూలు అటెండ్ కాగా 1500 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. దీని ద్వారా వచ్చిన అనుభవంతో ఈ నెల నుండి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళిక సిద్ధం అయ్యింది. మా కాల్ సెంటర్ లో
1800 4252 422 నిరుద్యోగ యువత రిజిస్టర్ చేసుకున్నట్లయితే, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశలో సహాయం చేస్తున్నాము..కార్పొరేట్ కనెక్ట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న 250 HR కంపెనీలతో వాట్సాప్ గ్రూప్ ద్వారా అనుసంధానమయ్యి ప్రాంతీయ యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము.