వార్తలు దేశీయం
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో
దేశ రాజధాని నగరమైన ఢిల్లీతోపాటు ఉత్తరాది రాష్ట్రాల ఎండలు మండుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండవేడిమితోపాటు వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఢిల్లీలో ఉష్ణోగ్రత 46.8 డిగ్రీలకు పెరిగింది. రోజురోజుకు మండుతున్న ఎండలు, వేడి గాలుల ప్రభావం వల్ల ప్రజలు ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. ఈ వేసవిలో ఎండల ఉద్ధృతి పెరిగినందు వల్ల ఎవరూ బయటకు రావద్దని భారత వాతావరణశాఖ అధికారులు రెడ్ కలర్ హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్షియస్ కు చేరుకోవడంతోపాటు వేడి గాలులు వీస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగుల పడవచ్చని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
ఉత్తరాదిలో మండుతున్న ఎండలు...రెడ్ కలర్ హెచ్చరికల జార