Highlights
- నేత రామ్ మాధవ్
ఈశ్యాన్యంలోని మూడు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.మేఘాలయలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. - నాగాలాండ్‌లో ఎన్పీఎఫ్ కూటమి ఆధిక్యంలో ఉంది. - త్రిపురలో హోరాహోరీ పోరీలో లెఫ్ట్ కొంత పైచేయి సాధించింది. ఏమాత్రం ప్రభావం లేని బీజేపీ సీపీఎంకు చుక్కలు చూపించింది. బీజేపీ గెలుస్తుందన్న అంచనాలు వచ్చాయి. అయితే సీపీఎంకు చుక్కలు చూపిన బీజేపీ రెండోస్థానంతో సరిపెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెజార్టీ వచ్చినా గతంతో పోల్చుకుంటే చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా సీపీఎం గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా పాలిస్తున్న సీపీఎంకు గత ఎన్నికల్లో 49 సీట్లు గెలిచింది. - నాగాలాండ్‌లో సీఎం జలియాంగ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. - త్రిపురలో పలు లెఫ్ట్ పార్టీ కంచుకోటల్లో బీజేపీ పాగా వేసింది. - తొలుత వెనుకంజలో ఉన్న బీజేపీ సీఎం అభ్యర్థి, బీజేపీ చీఫ్ బిప్లవ్ కుమార్ దేవ్ ఆ తర్వాత ముందంజలోకి వచ్చారు. - మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. - కృష్ణపూర్‌లో గెలుపుబాటలో ఉన్న మంత్రి ఖగేంద్ర మృతి చెందారు.
త్రిపుర, నాగాలాండ్‌లలో బీజేపీ, మిత్రపక్షాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత రామ్ మాధవ్ అన్నారు. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి మంచి ఫలితాలు ఇస్తాయన్నారు.
Seeing the earlier trends:, I feel that in Tripura BJP is going to do very well In Nagaland too, our alliance is doing very well and Congress is trailing in Meghalaya. The three results of North East are going to be very good for BJP: Ram Madhav, BJP pic.twitter.com/66V7BPCXDn
— ANI (@ANI) March 3, 2018