YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

టీడీపీపై ప్రతీకారం తీర్చుకోవడానికి బీజేపీ నేతల స్కెచ్?

టీడీపీపై ప్రతీకారం తీర్చుకోవడానికి బీజేపీ నేతల స్కెచ్?

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:   
 

వైసీపీ సునామీలో టీడీపీ కొట్టుకుపోయింది. మరో ఐదేళ్ల వరకు లేచే పరిస్థితి లేదు. దాదాపు క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ధాటికి మంత్రులు టీడీపీ అధినేత కొడుకు ఉద్దండులు ఓడిపోయారు. దీంతో ఇదే వేడిని కంటిన్యూ చేసి టీడీపీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కేంద్రంలోని బీజేపీ పెద్దలు స్కెచ్ గీసినట్లు సమాచారం.అధికారంలో ఉన్న వైసీపీ ఎలాగూ టీడీపీని ఎదగనీయకుండా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి బీజేపీ తోడైతే చంద్రబాబుకు దబిడదిబిడే.. అందుకే ఇప్పుడు దెబ్బతిన్న టీడీపీని చంద్రబాబును మరింత దెబ్బకొట్టాలని.. టీడీపీని కోలుకోకుండా చేయాలనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఆపరేషన్ టీడీపీ మొదలు పెట్టినట్లు తెలిసింది.ఇందులో భాగంగా బీజేపీని బలోపేతం చేయడానికి.. టీడీపీనీ నీరుగార్చడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు బీజేపీ పెద్దలు తెరతీయబోతున్నారట.. టీడీపీకి చెందిన కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఏడాదిలోపే టీడీపీ ఆపరేషన్ పూర్తి చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు 

తెలుస్తోంది.ఆపరేషన్ టీడీపీని బీజేపీ ప్రధాన కార్యదర్శి తెలుగు వ్యక్తి అయిన రాంమాధవ్ కు బీజేపీ అధిష్టానం అప్పగించినట్టు తెలిసింది.2024 ఎన్నికల నాటికి టీడీపీని నామరూపాలు లేకుండా 

చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇక బీజేపీయేతర పక్షాలను ఏకం చేసి కేంద్రంలో హంగ్ వస్తే బీజేపీని గద్దెదించాలని చంద్రబాబు మొన్నటి ఫలితాలకు ముందు చేయని ప్రయత్నం లేదు.కానీ బీజేపీ క్లియర్ కట్ మెజార్టీతో గెలవడం.. చంద్రబాబు ఓడిపోవడంతో బీజేపీ లక్ష్యం నెరవేరింది. ఇప్పుడు చంద్రబాబుపై ప్రతీకారానికి సిద్ధమవుతోంది. టీడీపీలోని కీలక నేతలను లాగేసి టీడీపీని దెబ్బతీయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే టీడీపీ అగ్రనేతల జాబితా తయారు చేసినట్టు సమాచారం. మాజీ మంత్రి ప్రతిప్తాటి.. పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు సహా చాలామందితో బీజేపీ చర్చలు సాగిస్తున్నట్టు తెలిసింది.రాంమాధవ్ నేతృత్వంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ టీడీపీని రాంమాధవ్ కే బీజేపీ అధిష్టానం అప్పగించడం విశేషం. మరి ఇటు వైసీపీ అటు బీజేపీ వ్యూహాలను తట్టుకొని చంద్రబాబు ఎలా నిలబడుతాడనేది వేచి చూడాలి.

Related Posts