YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మైలేజ్ పైనే నితీష్ గురి

మైలేజ్ పైనే నితీష్ గురి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:   
 

ఎన్డీయే లో కీలక భాగస్వామి బీహార్ లోని జేడీయూ. ఇప్పుడు కేంద్ర మంత్రి వర్గంలో ఎన్డీయే లో వున్న వారికి గతంలో ఇచ్చిన విధంగా అడిగినన్ని పదవులు కేటాయించలేదు ప్రధాని నరేంద్ర మోడీ. రెండోసారి పూర్తి మెజారిటీతో అధికారం అందుకున్న ఆయన మిత్రపక్షాలకు ఒక్కో బెర్త్ మాత్రమే కేటాయించి షాక్ ఇచ్చారు. అఖండ మెజారిటీ లభించడంతో నరేంద్రుడు సొంత పార్టీ వారి కష్టాన్ని గుర్తించారు. వారికి పెద్ద పీట వేసి మిత్రులకు అంతగా అవకాశం ఇవ్వలేమని చెప్పేశారు.జెడియు కోటాలో రెండు బెర్త్ లు క్యాబినెట్ లో కావాలని బీహార్ సిఎం నితీష్ కుమార్ ప్రధాని మోడీ ముందు తన అభ్యర్ధన ఉంచారు. అయితే మిత్రులకు ఒక్కటే అన్న నిబంధన జెడియు విషయంలో సడలిస్తే మిగిలిన వారి నుంచి వత్తిడి వస్తుందని గుర్తించి నితీష్ కోరిక ను నిరాకరించారు. దాంతో నితీష్ ఒక్క క్యాబినెట్ అయితే తమకు అక్కర్లేదని పంచాయితీ తెగ్గొట్టారు. అదే ఇప్పుడు హస్తిన రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.నితీష్ పూర్తి మెజారిటీ తో వున్న నరేంద్ర మోడీ ని ఢీ కొన్న ధైర్యం వెనుక పక్కా వ్యూహం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీహార్ లో ఇప్పటికే బిజెపి బలపడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఒక్క పదవి తీసుకుని వెనక్కి వచ్చే కన్నా నిరాకరించి వుండటం వల్ల ప్రజల్లో మైలేజ్ పెరుగుతుందని లెక్కేశారంటున్నారు. దానికి తోడు సిఎం కుర్చీ లో కూడా వాటా అడిగే స్టేజ్ కి బిజెపి విస్తరిస్తుందని నితీష్ గమనించారు. అందుకే మోడీ – షా జోరుకు ముందే అడ్డుకట్ట వేయాలని తనకుర్చీ కాపాడుకోవాలంటే త్యాగం తప్పదనే వ్యూహమే నితీష్ అమలు చేశారని తెలుస్తుంది.అయితే నితీష్ ఎన్డీయే లోనే కొనసాగుతానని ప్రకటించి మరో సంచలనం సృష్ట్టించారు. వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నాటికి జెడియు తో బీజేపీ పొత్తు తో ఎన్నికల బరిలోకి దిగుతుందా లేక ఈ రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తాయా అన్న అనుమానాలు మొదలయ్యాయి ఇప్పటినుంచి. లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం అందుకోవడంతో ప్రస్తుతం మిత్రులుగా వున్న జెడియు – బిజెపిలు విడి విడిగా పోటీ చేసి మెజారిటీ రాకపోతే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం పూర్తి మెజారిటీ సాధిస్తే నేరుగా ఆ పార్టీ పీఠం ఎక్కేయడం అనే ఫార్ములా లో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు పార్టీల వ్యూహాల్లో ఎవరిదీ ఫలిస్తుందో చూడాలి మరి.

Related Posts