పాలనలో మార్పులు తీసుకువస్తా.. మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అని ప్రమాణ స్వీకారం రోజే చెప్పిన ఏపీ సీఎం జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఏపీని మద్యపాన నిషేద రాష్ట్రంగా మార్చడానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో దశల వారీగా మద్యపానం నిషేధం అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీనికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో అన్వేషించాలని సూచించారు. శనివారం మధ్యాహ్నం ఆర్థిక, రెవెన్యూ శాఖలపై తాడేపల్లిలోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మద్యపానాన్ని నిరుత్సాహ పరిచేలా కార్యాచరణ ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. గొలుసు దుకాణాలపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాజీపడొద్దని అధికారులకు సూచించారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న నేపథ్యంలో ఆదాయ మార్గాలను అన్వేషించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నామని ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈరోజు ఆర్థిక, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్, వేర్వేరు అంశాలపై చర్చించారు.ఎన్నికల హామీ మేరకు ఏపీలో ఉన్న బెల్టు షాపులను ఎత్తివేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా చూడాలనీ, ఆర్థిక క్రమశిక్షణను పాటించాలని పునరుద్ఘాటించారు.రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లాల్సిన అగత్యం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వడ్డీలు కట్టేందుకు కూడా అప్పులు ఎందుకు చేస్తున్నామని అధికారులను నిలదీశారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సాంబశివరావు, పీవీ రమేశ్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్. రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవీంద్ర, సీఎం కార్యదర్శి ఆరోఖ్య రాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
44 వేల స్కూళ్లను ఇంగ్లీషు మీడయం స్కూళ్లగా మార్చండి
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 44,000 ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.అలాగే ప్రతి 40 కిలోమీటర్ల పరిధిలో అత్యాధునిక సౌకర్యాలతో సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేయాలన్న జగన్.. ఇకపై అక్కడి నుంచే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేయాలని ఆదేశించారు. పాఠశాలలకు తగినంత మంది అధ్యాపకులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఉన్నతాధికారులు సూచించారు.