YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ 77వ జన్మదిన వేడుకలు

ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ 77వ జన్మదిన వేడుకలు

మహర్షి చిత్రం ప్రదర్షింప బడుతున్న శివ సినీ కంప్లెక్స్ థియేటర్ లో పద్మభూషణ్ డాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ 77వ జన్మదిన వేడుకలను ఫ్యాన్స్ అధ్యక్షుడు వహాబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. 
ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక మినిశివ థియేటర్ లో ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన పది కేజీల కేకును కట్ చేసి అభిమానులకు, థియేటర్ సిబ్బంది, కార్మికులకు పంచి పెట్టారు.ఈ సందర్భంగా వహాబ్, కృష్ణమూర్తి లు మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా అలుపెరుగని శ్రామికునిలా సినీ జగత్తులో హీరోగా 350 చిత్రాలకు పైగా నటించి సరికొత్త రికార్డులను నెలకొల్పిన ఘనత కృష్ణ గారికే దక్కిందన్నారు. 
తెలుగు సినిమా రంగానికి కొత్త వెలుగులు అద్ది, సూపర్స్టార్ అనే పదానికి సరికొత్త అర్థం చెప్పిన కృష్ణగారు కోట్లాదిమంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.ఈ కార్యక్రమంలో అభిమానుల అధ్యక్షుడు ప్రిన్స్ వహాబ్, నదికైరవాడి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు పరమేష్,సీనియర్ అభిమానులు ఎంఎస్ వాసు,ఆనంద్,ఎటిఎం శ్రీను,డీలర్ శ్రీను, రాజు,నాగరాజు తదితరులు పాలోన్నారు.

Related Posts