యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మాజీ ముఖ్యమంత్రి చబద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నట్టుగా బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేయలేదు. చంద్రాబాబునాయుడు పై ప్రజా వ్యతిరేకత బలంగా ఉండడం వల్లనే వైసీపీప్రభుత్వం ఏర్పాటు అయిందని బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇంచార్జి సునీల్ డియోధర్ అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి వృద్ధాప్యపింఛన్ లు పెంచడం అభినందనీయం. అవినీతి రహిత పాలన అందిస్తాం. తారతమ్యాలకు అవకాశం ఇవ్వకుండా పారదర్శక పాలన బీజేపీఅందిస్తోందని అయన అన్నారు. చంద్రబాబు తీరును ఏడాదిన్నరగా చూస్తూనే ఉన్నాము.. మేము ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వాన్నికి పూర్తిగా మద్దతు పలికామని అన్నారు. ఈ రాష్ట్రాంలో మేమే భవిష్యత్తు లో అపొజిషన్ పార్టీగా ఉంటాం. రాష్ట్ర బీజీపీ ఇన్ఛార్జిగా వ్యవహరించిన వి. మురళీధరన్ కు , రెండు తెలుగు రాష్ట్రాలకు అధ్యుక్షుడిగా వ్యవహరించిన కిషన్ రెడ్డి కేంద్రమంత్రులుగా అవ్వడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఆధారాలను బట్టి చంద్రబాబునాయుడుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తే పరిశీలిస్తాం. అవసరమైతే సీబీఐ విచారణ కొరతామని అయన స్పష్టం చేసారు.