యువ్ న్యూస్ జనరల్ బ్యూరో
హైదరాబాదులో మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. ఏకకాలం లో మూడు చోట్ల సోదాలు కొనసాగాయి. బెస్ట్ అండ్ కాంప్టన్ పేరుతో తీసుకున్న రుణాలు వ్యహారం లో మరోసారి విచారణ చేస్తోంది. తప్పుడు ఇన్ వాయిస్ లతో రుణాలు పొందినట్లు ఆరోపణల నేపథ్యంలో గతంలో సీబీఐ , ఈడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లంచడం లేదని సీబీఐ కి బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేసారు. గతంలో మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసి ఈడీ కి బదిలీ చేసింది సీబీఐ. ఆంధ్ర బ్యాంక్ నుండి 71 కోట్లు రుణం పొంది ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఐదు మంది డెరెక్టర్లు, మ్యానేజింగ్ డైరెక్టర్ పై కేసు నమోదు చేసింది.