భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. భారత్‌కు ఇన్నాళ్లూ కల్పించిన ప్రాధాన్య వాణిజ్య హోదాను (జీఎస్పీ) రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం జూన్ 5వ తేదీ నుండి అమలులోకి రానున్నది. అమెరికా ఉత్పత్తులకు భారత మార్కెట్లలో ‘సమానమైన, సమర్థనీయమైన’ వాతావరణాన్ని కల్పించడంపై భారత్ నుంచి ఎటువంటి హామీ లభించనందున భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా రద్దు చేయాలని యోచిస్తున్నట్లు మార్చిలో కాంగ్రెస్‌కు ట్రంప్ లేఖ రాసిన విషయం తెలిసిందే. జీఎస్‌పీ తొలగింపు వల్ల భారత్ ఎగుమతులపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చునని వాణిజ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు